నందమూరి నటసింహం బాలయ్య బాబుతో తెర పంచుకోవడం ఓ వరం అని ఫీల్ అవుతుంటారు కొందరు నటీనటులు. బాలయ్యతో సెట్స్‌పై గడపడం అనేది ఓ అద్భుత అవకాశం అని ఇప్పటికే ఎందరో నటీనటులు పేర్కొన్నారు. ఆయన వ్యక్తిత్వం గురించి పలువురు హీరోయిన్స్ సైతం కామెంట్స్ చేశారు. తాజాగా కూడా బాలయ్య బాబుతో కలిసి నటించడంపై ఓపెన్ అయింది. సెట్లో ఆయన మెదిలే తీరును తెలుపుతూ పలు ఆసక్తికర విషయాలు చెప్పింది. పవర్‌పుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న '' సినిమాలో బాలయ్యతో కలిసి నటిస్తోంది హీరోయిన్ పూర్ణ. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య బాబు డిఫరెంట్ షేడ్స్‌లో దర్శనమీయనున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు చేరుకున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఓ మీడియాతో ముచ్చటించింది హీరోయిన్ పూర్ణ. ఈ సినిమాలో తన క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ అని చెప్పిన పూర్ణ.. సెట్స్‌పై మొదటిసారి బాలయ్యను కలిసిన సమయంలో ఆయన రిసీవ్ చేసుకున్న విధానానికి ఫిదా అయ్యాయని తెలిపింది. బాలయ్య అంటే ఓ సింహం అని అభివర్ణించిన ఆమె, షూటింగ్ సమయంలో తోటివారిని ఎంతో గౌరవిస్తూ చాలా సాదాసీదాగా ఉంటారని చెప్పుకొచ్చింది. ''ఓ రోజు నా ఫోన్ వాల్‌పేపర్‌గా మీ ఫొటో పెట్టుకుంటానని బాలయ్యకు చెప్పా. ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే మీ ఫొటో చూస్తానని చెప్పా. ఎందుకంటే ఆ సింహం లాగే ఎలాంటి కంప్లైంట్స్ లేకుండా రోజంతా పని చేయాలి కాబట్టి. బాలయ్య గారు ప్రతిరోజు సెట్స్‌కి వస్తారు. డైరెక్టర్ చెప్పింది చేస్తారు. బోయపాటి చెబుతుంటే 'అలాగే.. అలాగే' అనే మాట తప్ప ఆయన నోటినుంచి మరో మాటే రాకపోవడం చూశా. బాలయ్య లాంటి గ్రేట్ యాక్టర్‌తో మరిన్ని సినిమాలు చేసి మరింత స్ఫూర్తి పొందాలని ఉంది'' అని పూర్ణ తెలిపింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3E2MLXw
No comments:
Post a Comment