Sunday 12 September 2021

గ్యాంగ్ లీడర్ గౌతమ్!.. ఆ వీడియోను షేర్ చేసిన నమ్రత

సూపర్ స్టార్ ఫ్యామిలీ ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. , గౌతమ్, మహేష్, నమ్రతలకు సంబంధించిన ఏదో ఒక వార్త నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇక అయితే ప్రతీ రోజూ తన పిల్లలకు సంబంధించిన పోస్ట్ చేస్తూనే ఉంటారు. మహేష్ బాబు షూటింగ్ విశేషాలతో పాటు ఇంట్లో చేసే అల్లరి గురించి కూడా నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా చేసిన అల్లరిని నెట్టింట్లో పెట్టేశారు. ప్రస్తుతం పిల్లలకు చదువులన్నీ కూడా ఆన్ లైన్‌లోనే కొనసాగుతున్నాయి. ఈ మధ్యే బడులు కూడా తెరిచారు. కాలేజ్‌లు తెరవడం, పరీక్షలు పెట్టడం కూడా జరుగుతున్నాయి. అయితే గౌతమ్ మాత్రం వీటన్నంటి నుంచి కాస్త ఫ్రీ అయినట్టున్నాడు. గత నెలలోనే గోవాలో ఎంజాయ్ చేసి వచ్చారు. సర్కారు వారి పాట షూటింగ్ కోసం మహేష్ బాబుతో పాటుగా ఫ్యామిలీ కూడా వెళ్లింది. అక్కడ ఎంతలా ఎంజాయ్ చేశారో నమ్రత చెప్పుకొస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు కూడా మళ్లీ గౌతమ్ తన స్నేహితులతో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూపించారు. అసలే వీకెండ్, పరీక్షలు కూడా అయిపోయాయ్.. ఆ ఒత్తిడిని తీర్చుకునేందుకు గ్యాంగ్ మొత్తం ఒకే చోటకు చేరినట్టుంది. ఆ గ్యాంగ్‌కు గౌతమ్ లీడర్‌లా ఉన్నాడు. అందరూ కలిసి మహేష్ ఇంట్లోని స్విమ్మింగ్ పూల్‌లో సందడి చేస్తున్నారు. వాటికి సంబంధించిన వీడియోను నమ్రత తాజాగా షేర్ చేసింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/395mI3y

No comments:

Post a Comment

'Rahul Has To Be More Ruthless'

'I want to ask the Congress only one question: What is more important than election management in politics?' from rediff Top Inter...