Tuesday, 21 September 2021

HBD Karthikeya: చేతిలో విస్కీ బాటిల్.. సీరియస్ లుక్.. ‘వాలిమై’ నుంచి కార్తికేయ పోస్టర్ అదుర్స్

ఏ హీరోకి అయినా.. హీరోయిన్‌కి అయినా.. కరెక్ట్‌గా ఓ సినిమాతో బ్రేక్ వస్తే.. ఆ తర్వాత వాళ్లు ఇక కెరీర్‌లో దూసుకుపోతుంటారు. అలా మొదటి సినిమాతోనే చాలా సక్సెస్ సాధించి కెరీర్‌లో అద్భుతమైన సినిమాలు చేస్తున్న నటుడు . అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కార్తికేయ.. ఆ తర్వాత వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా.. విభిన్నమైన కథాంశాలతో సినిమాలు తీస్తే.. ముందుకు వెళ్తున్నారు ఆయన. అయితే పాత్ర నచ్చితే చాలు.. విలన్‌గా కూడా నటించేందుకు ఆయన సిద్ధమని ఇప్పటికే నిరూపించారు. నాని ప్రధాన పాత్రలో రూపొందిన ‘గ్యాంగ్‌లీడర్’ అనే సినిమాలో విలన్‌గా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు కార్తికేయ. అయితే ప్రస్తుతం కార్తికేయా ఓ స్టార్ హీరోతో ఢీ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఆయన మరెవరో కాదు.. తమిల ‘తలా’ అజిత్. హెచ్.వినోద్ దర్శకత్వంలో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘’. ఈ సినిమాలో విలన్‌గా కార్తికేయ నటిస్తున్నారు. అయితే అజిత్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా మంగళవారం కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ లుక్‌లో ఓ చేతిలో విస్కీ బాటిల్.. మరో చేతిలో వాకీ-టాకీ పట్టుకొని కార్తికేయ చాలా సీరియస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌ చూస్తే కార్తికేయ పాత్ర ఈ సినిమాలో చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుంది అని అర్థం అవుతోంది. ఇక ఈ సినిమాను ‘జీ స్టూడియోస్’, ‘బేవ్యూ ప్రాజెక్ట్స్ ఎఎల్‌పీ’ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హ్యూమా ఖురేషి, సుమిత్ర, యోగిబాబు తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాతో తమిళ ప్రేక్షకులకు పరిచయం అవుతున్న కార్తికేయ అక్కడ కూడా మంచి సక్సెస్ సాధించాలి అని అభిమానులు కోరుకుంటున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3lMiQdM

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....