Sunday 5 September 2021

నాని, రాహుల్ మధ్య ట్విట్టర్‌లో వార్.. ‘జాతిరత్నాలు’ డైలాగ్ కొట్టిన నాచురల్ స్టార్

కరోనా వైరస్ వ్యాప్తి పెరిగినప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కరోనాను అరికట్టేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు.. విడుదలకు సిద్ధంగా ఉన్న ఎన్నో సినిమాలు రిలీజ్ కాలేకపోయాయి. ఈ నేపథ్యంలో దర్శకనిర్మాతలకు సినిమాలను విడుదల చేసేందుకు కనిపించిన ఓకేఒక మార్గం ఓటీటీ. ప్రేక్షకులు కూడా హాయిగా ఇంట్లోనే కూర్చొని సినిమాలు చూడొచ్చు అనే ఉద్దేశంతో ఈ ఓటీటీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో దాదాపు గత ఏడాదిన్నర కాలంగా చాలా సినిమాలు ఈ ఓటీటీల్లోనే విడుదల అవుతున్నాయి. అలా త్వరలో ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమా ‘టక్ జగదీష్’. నాచురల్ స్టార్ హీరోగా.. రితు వర్మ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయి చాలాకాలమే అయింది. సినిమా ప్రమోషన్లు కూడా గట్టిగానే చేశారు. కానీ, ఈలోపే సెకండ్ వేవ్ కూడా వచ్చిపడటంతో సినిమా విడుదల వాయిదా పడింది. ఇక చేసేది ఏమీ లేక సినిమాను ఈ వినాయక చవితి కానుకగా.. ఓటీటీలో విడుదల చేస్తున్నామని కొద్ది రోజుల క్రితం చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ విడుదల విషయంలో హీరో నాని, నటుడు రాహుల్ రామకృష్ణలకు మధ్య చిన్న గొడవ జరిగింది. అంటే నిజంగా ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకొనే గొడవ కాదు.. సరదా గొడవ. రాహుల్ నటించిన ‘నెట్’ అనే సినిమా కూడా వినాయక చవితి కానుకగా విడుదల అవుతోంది. దీంతో హీరో నానిని ట్యాగ్ చేస్తూ.. ‘నేను నానికి చాలా పెద్ద పెద్ద అభిమానిని.. కానీ సెప్టెంబర్ 10న నా సినిమానే బెస్ట్‌గా ఉంటుంది అనే నమ్మకం నాకు ఉంది’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. దీనిపై నాని కూడా ఫన్నీగానే స్పందించారు. ‘జాతిరత్నాలు’ సినిమాలో రాహుల్ చెప్పిన ‘నా వల్లే ప్రాబ్లమ్ అయితే.. నేను ఎల్లిపోతా ఈడికెంచి’ అంటూ ట్వీట్ చేసిన నాని.. ‘నెట్‌’ని సినిమాను కూడా వీక్షించాలి అంటూ హ్యాష్‌ట్యాగ్ పెట్టారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన ఈ సరదా సంభాషణ అభిమానులతో నవ్వులు పూయిస్తోంది. ‘రెండు సినిమాలు చూస్తాము అన్న’ అంటూ వాళ్లు కామెంట్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ti0Z1L

No comments:

Post a Comment

'We want to be trust marker for the fintech industry'

'So, we would work with our members to ensure that we as an SRO create some sort of due diligence for fintechs.' from rediff Top I...