Tuesday 14 September 2021

కారులో కొంటె చేష్టలు.. భర్త చేసిన పనికి శ్రియ షాక్

తన భర్త ప్రస్తుతం తిరుమల వెంకన్న దర్శనంలో ఉన్నారు. ఇటీవలె రష్యా నుంచి ముంబైకి వచ్చింది ఈ జంట. ముంబైలో తమ అభిరుచికి తగ్గట్టుగా ఓ ఇంటిని వెతుక్కున్నారు. ఇంటి కోసం వేటలో ఉన్నామని చెబుతూ షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు ఆ మధ్య బాగానే వైరల్ అయ్యాయి. అయితే మొత్తానికి ముంబైలో ఓ ఇంట్లో అద్దెకు దిగినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు శ్రియ తన సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైద్రాబాద్‌లో వాలింది. ఇక ఇప్పుడు ఈ జంట శ్రీవారి సన్నిధిలో ఉంది. నేటి ఉదయం శ్రియ, ఆండ్రూ ఇద్దరూ కూడా ఏడుకొండల స్వామిని దర్శించుకున్నారు. మామూలుగానే ఈ జంట ఎప్పుడూ సరసాలు ఆడుకుంటూ ఎంతో సరదాగా ఉంటారు. సోషల్ మీడియాలో ఈ జంట చేసే అల్లరికి అందరూ ఫిదా అవుతుంటారు. ఒక్కోసారి హద్దులు కూడా దాటుతుంది. మితిమీరినట్టుగా ముద్దులుపెట్టేసుకుంటారు. ఓ సందర్భంలో అయితే ఆండ్రూ ఏకంగా శ్రియ ఎద భాగంపైనే తన ప్రతాపాన్ని చూపించేశాడు. బోటులో షికారు చేస్తుండగా తీసిన ఆ వీడియో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఇక తాజాగా తిరుపతి నుంచి వెనుదిరిగిన ఈ జంట కారులోనూ సరసాలు మానలేనట్టు కనిపిస్తోంది. కారులో వస్తుండగా శ్రియను కుదురుగా ఉండనివ్వలేదు ఆండ్రూ. పెన్ను పట్టుకుని ఆమె చెవిలో పెట్టి చెక్కిలిగింతలు కలిగేలా చేశాడు. దీంతో శ్రియా దెబ్బకు షాక్ అయింది. నవ్వుతూనే భర్తను వద్దని వారించే ప్రయత్నం చేసింది. మొత్తానికి ఈ జంట మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. వీరిద్దరి సాన్నిహిత్యాన్ని చూసి ముచ్చటపడుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3E8vZpY

No comments:

Post a Comment

Rekha: 'I Welcome Pain. It Helps Me Grow'

'I don't know of any happy moment in my life which has helped me to grow, whereas pain has always been a means to evolve.' fro...