Saturday, 21 August 2021

HBD Chiranjeevi : మామా అంటూ సుప్రీమ్ హీరో.. వాటిని గుర్తు చేసిన నాగబాబు!!

మెగాస్టార్ బర్త్ డే (ఆగస్ట్ 22) గురించి తెలుగు ప్రజలందరికీ తెలిసిందే. ఎవరి పుట్టినరోజులు గుర్తున్నా లేకపోయినా కూడా చిరు బర్త్ డే గురించి మాత్రం అందరికీ తెలుస్తుంది. అలా చిరు బర్త్ డే అంటే బయట మాత్రమే కాదు ఇండస్ట్రీలోనూ ఓ పండుగే. అలాంటి చిరు బర్త్ డే సందర్భంగా ట్విట్టర్, ఫేస్ బుక్ ఇలా అన్నీ కూడా మోతమోగిపోతోన్నాయి. చిన్నా పెద్దా నిర్మాతలు దర్శకులు ఇలా అందరూ కూడా చిరుకు విషెస్ చెబుతున్నారు. తాజాగా చిరంజీవి గురించి చెబుతూ , వేసిన పోస్ట్‌లు,చెప్పిన విషెస్‌లు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు, ఎన్టీఆర్ వంటి హీరోలు విషెస్ చెప్పేశారు. భోళా శంకర్ అంటూ వేదాళం రీమేక్ టైటిల్ పోస్టర్‌ను మహేష్ బాబు రివీల్ చేస్తూ విషెస్ చెప్పేశారు. ఇక బన్నీ కూడా తన ప్రేమను చాటుకున్నారు. రామ్ చరణ్ అయితే ఏకంగా ఆచార్య షూటింగ్ లొకేషన్ వీడియోను షేర్ చేస్తూ తండ్రి మీద ప్రేమను కురిపించారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా ఓ సుధీర్ఘ ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు. తాజాగా సాయి ధరమ్ తేజ్ మామా అంటూ ప్రేమగా పిలుస్తూ పోస్ట్ వేశారు. మిమ్మల్ని చూస్తూ పెరగడమే ఓ గొప్ప పాఠం లాంటిది. మీ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఎంతో మందికి స్ఫూర్తిప్రధాతలు. అందరికీ ఒకే రకంగా ప్రేమించడం, గౌరవించడం నేర్పినందుకు థ్యాంక్స్. హ్యాపీ బర్త్ డే మామా అని పోస్ట్ చేశారు. ఇక నాగబాబు అయితే చిరంజీవికి సంబంధించిన రేర్ ఫోటోలన్నీ వీడియో రూపంలో ఎడిట్ చేసి.. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో మిక్స్ చేసి వదిలారు. బ్రూస్ లీ బ్యాక్ గ్రౌండ్‌లో ఉన్న ఈ వీడియోలో చిరు, పవన్, నాగబాబు, రామ్ చరణ్ అందరూ ఉన్నారు. చెప్పాల్సిందంతా ఆ వీడియోలోనే చెప్పడంతో సింపుల్‌గా హ్యాపీ బర్త్ డే అన్నయ్య అని పోస్ట్ చేశారు నాగబాబు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3D4B1mV

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....