Saturday, 21 August 2021

Acharya: అదిరిపోయే వీడియో.. తండ్రితో మరువలేని క్షణాలంటూ రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్

ఈ రోజు (ఆగస్టు 22) మెగాస్టార్ . అంటే అటు సినీ లోకానికి, ఇటు మెగా ఇంట పండగ రోజు అని చెప్పుకోవచ్చు. కోట్లాది మంది మెగాస్టార్ ఫ్యాన్స్ ఈ రోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటూ తమ అభిమాన హీరో చిరంజీవికి బెస్ట్ విషెస్ పోస్ట్ చేస్తుంటారు. అటు చూస్తే మెగా కాంపౌడ్ హీరోలంతా కూడా అంటే పడిచచ్చే అభిమానులే. ముఖ్యంగా చిరంజీవి తనయుడు, మెగా పవర్ స్టార్ తన తండ్రిని ఎంతగానో ఇష్టపడతారు. అయితే పప్పా అంటే ఎంతిష్టమో తెలిపేలా తాజాగా '' నుంచి ఓ వీడియో పోస్ట్ చేస్తూ చిరంజీవికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు రామ్ చరణ్. ఆచార్య సెట్స్‌లో తన తండ్రి చిరంజీవితో గడిపిన క్షణాలను వీడియో రూపంలో అందరి ముందుంచుతూ 'జీవితంలో మరువలేని క్షణాలు ఇవి' అని రామ్ చరణ్ పేర్కొన్నారు. ''మై ఆచార్య'' అనే హ్యాష్ ట్యాగ్ జత చేస్తూ తండ్రిపై ఉన్న ప్రేమను, గౌరవాన్ని చాటుకున్నారు. ఈ వీడియో చూసి మెగా లోకం ఫిదా అవుతోంది. తెగ షేర్ చేసుకుంటూ 'ఆచార్య' కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాం అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. కొరటాల శివ రూపొందిస్తున్న ఈ 'ఆచార్య' మూవీలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బలమైన కథ రాసుకొని ఇద్దరు మెగా హీరోలతో సెన్సేషన్ క్రియేట్ చేసేలా ప్లాన్ చేశారు కొరటాల. గతంలో ఎప్పుడూ లేని విధంగా నక్సల్స్ బ్యాక్‌డ్రాప్‌తో రాబోతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తుండగా.. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే ఆడిపాడుతోంది. ఇప్పటికే విడుదలైన 'ఆచార్య' అప్‌డేట్స్ సినిమాపై ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ చేశాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/380wZO8

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....