Saturday 21 August 2021

‘మళ్ళీ మొదలైంది’ ప్రమోషన్స్ షురూ.. ‘ఏంటో ఏమో జీవితం’ అంటోన్న సుమంత్

సినిమాలకు ఇది వరకెన్నడూ జరగని రీతిలో ప్రమోషన్స్ జరిగాయి. సుమంత్ రెండో పెళ్లి అంటూ ఓ వెడ్డింగ్ కార్డ్ నెట్టింట్లో వైరల్ కావడం, అది కాస్త సోషల్ మీడియా, వెబ్ సైట్లు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కేసరికి సుమంత్ స్పందించారు. అది తన తదుపరి చిత్రం సినిమాకు సంబంధించింది అని క్లారిటీ ఇచ్చేశారు. అలా సుమంత్ మళ్లీ మొదలైంది సినిమాకు ఫుల్ క్రేజ్ వచ్చేసింది. మొత్తానికి సుమంత్ సినిమా మీద అందరికీ పాజిటివ్ బజ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆ మధ్య విడుదలైంది. డైవర్స్, రీ మ్యారేజ్ అనే అంశంపై తెలుగులో వస్తున్న మొదటి సినిమా తమదే నంటూ సుమంత్ చెబుతున్నారు. విశేషం ఏమంటే… ఇది న్యూ ఏజ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ అనేది విషయం ఆ పోస్టర్ చూస్తే అర్థమైపోతుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ విడుదలైంది. దీన్ని యంగ్ హీరో నితిన్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. ‘ఏంటో ఏమో జీవితం… ఎందుకిలా చేస్తాదో జీవితం’ అంటూ సాగే ఈ పాటను కృష్ణ చైతన్య రాయగా.. సాయిచరణ్‌ పాడారు. అనూప్ రూబెన్స్ స్వరాలు అందించారు. ఈ లిరికల్ వీడియోలో హీరోహీరోయిన్లు సుమంత్, నైనా గంగూలీతో పాటు పోసాని, ఘట్టమనేని మంజుల, సుహాసిని, అన్నపూర్ణమ్మ, ‘వెన్నెల’ కిషోర్ తదితరులు ఇందులో ఉన్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో చక్కటి ఫ్యామిలీ బాండింగ్ కూడా ఉందని ఈ లిరికల్ వీడియో చూస్తే అర్థమౌతోంది. విశేషం ఏమంటే.. ఈ మూవీ ప్రమోషన్ ను కూడా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారన్నది ఇన్ స్టాగ్రామ్ లో చక్కర్లు కొడుతున్న మీమ్స్ చూస్తే అర్థమౌతోంది. ఈ సినిమాను కీర్తి కుమార్ దర్శకత్వంలో కె. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. మొత్తానికి ‘మళ్ళీ రావా’ తర్వాత మరోసారి ‘మళ్ళీ మొదలైంది’తో సుమంత్ హిట్ కొట్టేట్టే కనిపిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3mkvend

No comments:

Post a Comment

'Rakesh Jhunjhunwala Inspires Investors'

'More investors now view the stock market as a valuable opportunity, though many still seek quick gains, leading to a rise in futures an...