Sunday, 22 August 2021

మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉంది!.. నెటిజన్ ట్వీట్‌కు కుష్బూ దిమ్మతిరిగే సమాధానం

సీనియర్ నటి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. సినీ రాజకీయ అంశాలపై ఎప్పటికప్పుడు కుష్బూ స్పందిస్తుంటారు. పర్సనల్ విషయాలను సైతం కుష్బూ పంచుకుంటారు. తన ఫ్యామిలీ, పిల్లలు అంటూ వారి ఫోటోలను కూడా షేర్ చేస్తుంటారు. అయితే గత కొన్ని రోజుల నుంచి కుష్బూ తన ఫిట్ నెస్ మీద ఎంతగానో దృష్టిపెట్టేశారు. రోజూ వర్కవుట్లతో కుస్తీ పడిన కుష్బూలో ఇప్పుడు ఎంతో మార్పు కనిపిస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఎవ్వరైనా సరే ఫిదా కావాల్సిందే. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇందులో ఆమె యంగ్ హీరోయిన్‌లా మారిపోయారు. ఆ ఫోటోలపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే ఏకంగా పెళ్లి ప్రపోజల్ పెట్టేశాడు. కుష్బూ ఫోటోలను చూసిన అతగాడు.. మేడం మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను? అని అడిగేశాడు. ఆ నెటిజన్ పెట్టిన కామెంట్‌కు కుష్బూ స్పందించారు. ఓ.. సారీ.. నువ్ ఒక 21 ఏళ్ల క్రితం పుట్టి ఉండాల్సింది..సరేలే ఒకసారి మా ఆయన్ను అడుగుతాను అని సెటైర్ వేశారు. ఆతరువాత మరో నెటిజన్ ఇంకో కౌంటర్ వేశారు. మీ ఆయన్ను అడిగావా? ఏం సమాధానం చెప్పారు? అని అనేశాడు. నేను ఆయనకు ఒక్కగానొక్క భార్యని అంటా.. నన్ను వదిలేసుకోలేరంటా? అందుకే సారీ అని ఫన్నీ ట్వీట్ వేశారు. మొత్తానికి ఇలా పెళ్లి ప్రపోజల్స్‌తో కుష్బూ చేసే హల్చల్ అంతా ఇంతా కాదిప్పుడు. కుష్బూ ప్రస్తుతం శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలో నటిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gn3ACo

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....