Sunday, 22 August 2021

Chiru 154 : పూనకాలు లోడింగ్..చిరు బాబీ ప్రాజెక్ట్ అప్డేట్ వైరల్

మెగాస్టార్ బర్త్ డే (ఆగస్ట్ 22) సందర్భంగా సినిమా అప్డేట్లు ఎలా వస్తున్నాయో అందరికీ తెలిసిందే. ఇప్పటికే వేదాళం రీమేక్ టైటిల్ పోస్టర్ వచ్చేసింది. భోళా శంకర్‌గా చిరు కనిపించబోతోన్నారు. ఇందులో చిరు చెల్లిగా కీర్తి సురేష్ నటించబోతోన్నారు. రాఖీ సందర్భంగా అదిరిపోయే వీడియోను విడుదలచేసింది. ఇక బాబీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది. మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్ నేటి సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు విడుదలైంది. మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా సినిమా అప్డేట్ ఇవ్వబోతోన్నామని నిన్ననే ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో మెగా వేవ్ అని ప్రకటించి సినిమా నేపథ్యాన్ని చెప్పకనే చెప్పేశారు. పెద్ద పెద్ద పడవలు కూడా కనిపించడంతో ఈ మూవీ ఎలా ఉండబోతోందో అని మెగా అభిమానులు ఇప్పుడే ఊహించుకుంటున్నారు. తాజాగా వదిలిన పోస్టర్‌తో ఇది మాస్‌ కా బాస్ అనేలా ఉంది. ఇందులో చిరంజీవి లుక్కును సరిగ్గా చూపించలేదు. కానీ ఇందులో చిరు ఎలా కనిపించబోతోన్నారో క్లియర్ కట్‌గా చూపించేశారు. వీరయ్య అనే టైటిల్‌లో రాబోతోన్నట్టు తెలుస్తోంది. ఇందులో చిరు జాలరిగా కనిపించబోతోన్నట్టు ఉన్నారు. చిరు లుక్కును బ్యాక్ నుంచి రివీల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మాస్‌కు పర్యాయపదంగా మారిన చిరు.. బాబీ ప్రాజెక్ట్‌తో మరో లెవెల్‌ అనేట్టున్నారు. ఇక ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయే సంగీతాన్ని అందించబోతోన్నారు. మైత్రీ మూవీస్ ఈ సినిమాను అత్యంత భారీ ఎత్తున నిర్మించబోతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38iDR9X

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....