Friday, 19 March 2021

Y.S Jagan: తొక్క తీస్తానంటూ ఊహించని షాకిచ్చిన శ్రీ రెడ్డి.. ఎన్టీఆర్ విషయంలో అలా! సీఎంపై ఓపెన్ కామెంట్స్

సంచలన తార శ్రీ రెడ్డిని చూస్తే.. ఆటం బాంబ్ అనాలా లేక హాట్ బాంబ్ అనాలా అర్థంకాని పరిస్థితి. కాస్టింగ్ కౌచ్ ఉద్యమం చేసి నడిరోడ్డుపై అర్ధ నగ్న ప్రదర్శనతో దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిన ఆమె.. నిత్యం ఏదో ఒక టాపిక్‌తో హల్చల్ చేస్తూనే ఉంది. డైలీ సమాజంలో జరిగే అంశాలపై స్పందిస్తూ ఓపెన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చేస్తున్న కామెంట్స్ జనాల్లో చర్చనీయాంశంగా మారుతుండటం విశేషం. ఇటీవలే యంగ్ టైగర్ విషయంలోనూ ఇదే జరిగింది. అయితే ఇప్పుడు సడెన్‌గా ఎన్టీఆర్ విషయంలో శ్రీ రెడ్డి యూ టర్న్ తీసుకోవడం హాట్ ఇష్యూగా మారింది. నందమూరి వారసుడు, స్టార్ హీరో ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ గురించి ఇటీవలే శ్రీ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఏపీలో జరిగిన గత ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం చవిచూసిన అనంతరం ఆ పార్టీకి ఎన్టీఆర్ అవసరం ఎంతైనా ఉంది అనే మాట ఎక్కువగా వినిపిస్తున్న తరుణంలో.. రీసెంట్‌గా జరిగిన ఓ ప్రెస్ మీట్‌లో ఎన్టీఆర్‌కి ఈ ప్రశ్న ఎదురుకావడంతో మరోసారి ఇష్యూ తెరపైకి వచ్చింది. దీంతో ఆ ప్రెస్ మీట్‌కి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ ఎన్టీఆర్ గురించి వరుస ట్వీట్స్ పెట్టిన శ్రీ రెడ్డి.. యంగ్ టైగర్‌పై ప్రశంసలు గుప్పించింది. 'అభిమానులను తన కుటుంబంలా చూసుకునే ఒకే ఒక్క దమ్మున్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ గారు' అంటూ మొదలుపెట్టి 'ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారో రారో నాకు తెలియదు కాని వస్తే మాత్రం పక్కా CM అవుతారు, ఎందుకంటే తెలుగు ప్రజలు ఆయనను వాళ్ళ ఇంట్లో సొంత కొడుకులా, అన్నలా చూస్తారు' అని ట్విట్టర్‌లో ట్వీట్స్ వదిలింది. ఇవి చూసి నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే తాజాగా ఆ ఆనందాన్ని ఆవిరి చేసేలా ఆటం బాంబ్ వేసింది శ్రీ రెడ్డి. ''నాకు తెలిసి ట్విట్టర్ ఫేక్ అకౌంట్ పర్సన్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. తొక్క తీస్తా బిడ్డా. నేను ఎప్పటికీ గారి అభిమానిని. ఆయననే ఆరాధిస్తున్నాను. ఆయనను రీప్లేస్ చేసే వాళ్లు ఎవరూ లేరు. జై జగన్'' అంటూ తన ఫేస్‌బుక్‌లో కామెంట్ చేసింది శ్రీ రెడ్డి. అంటే సదరు ట్విట్టర్ అకౌంట్ ఫేక్ అని చెప్పింది ఈ సెన్సేషన్ క్వీన్. దీంతో ఈ కామెంట్‌పై నెటిజన్ల నుంచి భిన్న స్పందన వస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eXtFYJ

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....