Wednesday, 24 March 2021

Srinivas Avasarala: అవసరాల శ్రీనివాస్ షాకింగ్ వీడియో లీక్ చేసిన కో డైరెక్టర్.. ఇది బయటకు వెళ్తే ఇండస్ట్రీలో ఉండవ్.. వైరల్ వీడియో

నటుడిగా దర్శకుడిగా రచయితగా తన మల్టీ టాలెంట్‌తో ఎన్నో సినిమాల్లో పనిచేసిన అవసరాల శ్రీనివాస్‌కి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అతని కో డైరెక్టర్ మహేష్.. ఈ వీడియోను బయటపెట్టడంతో హాట్ టాపిక్‌గా మారింది. దగ్గర గత మూడేళ్లుగా పనిచేస్తున్న మహేష్ అనే కోడైరెక్టర్‌కి అవసరాల శ్రీనివాస్‌కి మధ్య గొడవలు రావడంతో అవసరాల శ్రీనివాస్.. తన కోడైరెక్టర్‌ని తిట్టి తన ఆఫీస్‌ని నుంచి గెంటేయడంతో వివాదం రేగింది. అయితే తనను అవమానించి అవసరాలను బండారం మొత్తం బయటపెడుతూ.. ఆఫీస్‌కి వెళ్లి రచ్చ రచ్చ చేసిన మహేష్.. అవసరాల రియల్ ఫేస్‌ను వీడియోలో చూపించి షాక్ ఇచ్చింది. ఉంగరాల జుట్టుతో చక్కగా కనిపించే అవసరాల రియల్ ఫేస్‌ని రివీల్ చేసేశాడు. పూర్తి బట్టతలతో కనిపించి షాకిచ్చాడు అవసరాల. అయితే ఈ వీడియో బయటకు వెళ్తే.. నిన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తా అని మహేష్‌ని బెదిరిస్తూ కనిపించారు అవసరాల. ఇంతకీ అవసరాల శ్రీనివాస్ కోడైరెక్టర్ మహేష్ విడుదల చేసిన వీడియోలో ఏమన్నారంటే.. మీ అందరికీ ఒక విషయం చెప్పాలని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా.. ఇండస్ట్రీలో అవసరాల శ్రీనివాస్ అనే ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ ఉన్నాడుగా.. అతని దగ్గర నేను గత మూడేళ్లుగా పనిచేస్తున్నాను.. నేను ఎలాంటి తప్పు చేయకపోయినా.. ఈరోజు నన్ను అందరి ముందు నిలబెట్టి తిట్టి ఆఫీస్ నుంచి నన్ను బయటకు పంపించేశాడు. ఒక్కటంటే ఒక్క రీజన్ కూడా లేదు. అతని నిజస్వరూపం మీకు చూపిస్తా చూడండి’ అంటూ అవసరాల శ్రీనివాస్ ఫొటో షూట్ చేయించుకుంటుండగా.. అతని దగ్గరకు వెళ్లి నేను ఏం తప్పుచేశా అని నిలదీశాడు కోడైరెక్టర్. ‘ఏయ్ నువ్వెందుకు వచ్చావ్ ఇక్కడికి అని.. అవసరాల శ్రీనివాస్ బూతులు తిడుతూ కనిపించగా.. నేను మూడేళ్లుగా మీ దగ్గర కష్టపడుతున్నా.. నన్నెందుకు తిట్టావ్.. ఎందుకు బయటకు పంపేశావ్’ అని ఆ కోడైరెక్టర్ తిరగబడ్డాడు. అయితే అంతటితో ఆగని మహేష్ అనే కోడైరెక్టర్.. అవసరాల శ్రీనివాస్ తలపై ఉన్న క్యాప్‌ని బలవంతంగా తీసేసి.. వీడియో తీస్తూనే ఉన్నాడు. అయితే క్యాప్ తీయగానే అవసరాల పూర్తి బట్టతలతో ఉన్నారు. దీంతో ఈ వీడియో బయటకు వెళ్తే మహేష్ నిన్ను ఇండస్ట్రీలో లేకుండా చేస్తా అని బెదిరించారు అవసరాల. బయటకు వెళ్లడం కాదు.. యూట్యూబ్ ఇన్ స్టాగ్రామ్ అన్నింటిలోనూ పెట్టేస్తా అని కోడైరెక్టర్ మహేష్.. అవసరాలను బ్లాక్ మెయిల్ చేస్తూ కనిపించాడు. అతన్ని ఆపండయ్యా.. అని అవసరాల శ్రీనివాస్ గట్టిగా అరుస్తూ ఆ వీడియోలో పంపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయ్యో అవసరాల అనవసరంగా బుక్కయ్యాడే అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇదిలా ఉంటే.. తన మూవీ ప్రమోషన్స్‌ని డిఫరెంట్‌గా ప్లాన్ చేసే అవసరాల శ్రీనివాస్.. ఈ వీడియో కూడా ప్రమోషన్స్‌లో భాగంగా వదిలిందే అని.. ఆయన అప్ కమింగ్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ వీడియోను వదిలి ఉంటారనే డౌటానుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అక్కడ అవసరాల పెర్ఫామెన్స్ చూస్తుంటే ఇదేదో ప్రమోషన్స్ ట్రిక్స్‌లాగే అనిపిస్తుంది. చూడాలి మరి ఇది రియల్‌నా లేక రీలో.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3f8yFda

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....