Sunday, 21 March 2021

Saranga Dariya Song: సాయి పల్లవి కాదు సింగర్ మంగ్లీ.. మాస్ డాన్స్ వీడియోపై క్రేజీ కామెంట్స్

సాయి పల్లవి ఆట పాట అంటే ఏ రేంజ్‌లో సెన్సేషన్ అవుతుందనేది మరోసారి 'సారంగా దరియా' సాంగ్ ద్వారా రుజువైంది. విడుదలైన మరు క్షణం నుంచే ఈ సాంగ్ నెట్టింట దూసుకెళ్ళడం ప్రారంభించి వ్యూస్ పరంగా గత రికార్డులు తిరగరాస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ పల్లెపాట రాగమే వినిపిస్తోంది. పాడిన ఈ సాంగ్ లోని మాస్ బీట్ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. దీంతో ఈ పాటకు డాన్సులేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు జనం. తాజాగా మంగ్లీ కూడా 'సారంగా దరియా' పాటకు స్టెప్పులేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్ అయింది. ఎంత హుషారుగా సారంగా దరియా పాట పాడిందో అంతే హుషారుగా స్టెప్పులేసి ఆకట్టుకుంది మంగ్లీ. పాటలో సాయి పల్లవి వేసిన స్టెప్పులతో యమ అట్రాక్ట్ చేస్తూ ఆమెను రీప్లేస్ చేసింది మంగ్లీ. దీంతో ఈ వీడియో చూసి.. 'మీరు పాడిన పాటకే మీరే డ్యాన్స్ చేయడం.. పాటకు కొత్తదనం వచ్చినట్టుంది' అని పేర్కొంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో మంగ్లీ ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వేలల్లో లైక్స్ రావడం, ఆమె డాన్స్ పర్‌ఫార్‌మెన్స్ చూసి అంతా ఫిదా అవుతుండటం విశేషం. కాగా 'లవ్ స్టోరీ' మూవీ నుంచి ఈ 'సారంగా దరియా' సాంగ్ బయటకు వదిలినప్పటి నుంచే వివాదం మొదలైన సంగతి మనందరికీ తెలుసు. ఇది తాను కలెక్ట్ చేసిన జానపదం అంటూ కోమలి అనే అమ్మాయి మీడియా ముందుకు రావడంతో ఇష్యూ వైరల్ అయింది. చివరకు అదే విషయాన్ని చిత్ర డైరెక్టర్ కన్ఫర్మ్ చేయడంతో వివాదం సద్దుమణిగింది. ఏదేమైనా ఈ సాంగ్ మాత్రం నాగ చైతన్య- సాయి పల్లవి జంటగా రాబోతున్న 'లవ్ స్టోరీ' మూవీపై మంచి బజ్ క్రియేట్ చేసిందనే చెప్పుకోవాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cZr4uZ

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....