Friday, 19 March 2021

Nithiin: ఓ పాప మా కాలనీకి వచ్చింది.. అప్పటినుంచి తొక్కడం స్టార్ట్ చేసింది.. గోడు వెల్లడించిన నితిన్

నితిన్, జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ 'రంగ్ దే'. ''తొలిప్రేమ, మజ్ను'' వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన యువ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇటీవలే షూటింగ్ ఫినిష్ చేసి చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రయూనిట్ ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసి ఇప్పటికే ఉన్న ఆ అంచనాలకు రెక్కలు కట్టారు. 2 నిమిషాల 20 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ ట్రైలర్.. ''నేను అర్జున్‌. నాకొక గర్ల్‌ ఫ్రెండ్‌ని ప్రసాదించమని దేవుణ్ని కోరుకున్నాను. కోరుకున్న ఆరో సెకండ్‌కి ఒక పాప మా కాలనీకి వచ్చింది. అప్పటి నుంచి తొక్కడం స్టార్ట్‌ చేసింది'' అని చెబుతున్న డైలాగ్‌తో ప్రారంభమై ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ సినిమాలో నితిన్, కీర్తి టామ్ అండ్ జెర్రీ లాంటి పాత్రలను పోషిస్తున్నారని అర్థమవుతోంది. నితిన్‌పై ప్రతీకారం తీర్చుకునే యువతిగా కీర్తి రోల్ ఉందని తెలుస్తోంది. ఇక వాళ్ళిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్, కామెడీ సన్నివేశాలు చిత్రంలో మేజర్ అట్రాక్షన్ కానున్నాయని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. నితిన్ కెరీర్‌లో 29వ సినిమాగా సితార ఎంటర్టైన్మైంట్స్ బ్యానర్‌పై ఈ మూవీ రూపొందింది. ఇందులో నరేష్, వినీత్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని మార్చి 26న రిలీజ్ చేయబోతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3r1bV0Z

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....