Wednesday, 17 March 2021

Naga Babu: వరుణ్ తేజ్ పెళ్లిపై నాగబాబు ఓపెన్.. ఆ అమ్మాయే కావాలన్నా నాకు ఓకే అనేస్తూ షాకింగ్ కామెంట్స్

లాక్‌డౌన్ వేళ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా వరుసపెట్టి పెళ్లిపీటలెక్కేశారు. నితిన్, నిఖిల్, రానా లాంటి యంగ్ హీరోలతో పాటు కాజల్, నిహారిక లాంటి హీరోయిన్స్ కూడా పెళ్లి బాజాలు మోగించి ఓ ఇంటి వాళ్ళయ్యారు. అయితే ఎప్పుడైతే మెగా డాటర్ నిహారిక పెళ్లి జరిగిందో ఆ మరుసటి క్షణం నుంచే అందరి కళ్లు పెళ్లిపై పడ్డాయి. పైగా, వరుణ్‌కి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం కానీ వాడే వద్దంటున్నాడంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈ మెగా హీరో పెళ్లి మ్యాటర్ జనాల్లో హాట్ ఇష్యూగా మారింది. ఇంకేముంది మెగా హీరో పెళ్లి వార్తలతో సోషల్ మీడియా షేక్ అయ్యింది. ఓ ఫేమస్ యంగ్ హీరోయిన్‌ని వరుణ్ పెళ్లాడబోతున్నారని గాసిప్స్ పుట్టుకొచ్చాయి. అంతేకాదు ఆ హీరోయిన్ వరుణ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన సినిమాలో నటించిందని కూడా వార్తలు వచ్చేశాయి. ఆ తర్వాత హైదరాబాద్‌కు చెందిన ఓ పారిశ్రామికవేత్త కుమార్తెతో వరుణ్ పెళ్లి జరుగుతుందని ప్రచారం జరిగింది. అయితే వీటిలో దేనిపై కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో వరుణ్ పెళ్లి మ్యాటర్ చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితుల నడుమ మరోసారి వరుణ్ మ్యారేజ్ ఇష్యూపై నాగబాబు ఆసక్తికరంగా రియాక్ట్ కావడం విశేషం. సోషల్ మీడియాలో యమ యాక్టివ్ రోల్ పోషిస్తున్న నాగబాబు తాజాగా అభిమానులతో ఇన్స్‌స్టా వేదికగా చిట్ చాట్ చేశారు. ఫ్యాన్స్ అడిగిన అన్ని ప్రశ్నలకు ఏ మాత్రం సందేహించకుండా సమాధానాలు ఇచ్చారు. 'వరుణ్ అన్న మ్యారేజ్ ఎప్పుడు చేస్తారు బాస్?' అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. 'మంచి సంబంధాలు ఉంటే చూడండి' అని నాగబాబు ఆన్సర్ చేశారు. అయితే 'వరుణ్ ఒక మిడిల్ క్లాస్ గర్ల్ తోనే లైఫ్ అనుకొని ఆ అమ్మాయినే చేసుకుంటా.. అదే ఫిక్స్ అంటే మీరు ఏం చేస్తారు?' అని మరో నెటిజన్ అడగ్గా.. 'మీకు మీకు ఓకే అయితే నేనేమంటా..!' అంటూ తన కుమారుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఇబ్బంది లేదనే హింట్ ఇచ్చేశారు మెగా బ్రదర్. ఇక వరుణ్ కెరీర్ విషయానికొస్తే.. 'ముకుంద' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి ఒక్కోమెట్టు ఎక్కుతూ మెల్లగా స్టార్ హీరో అయ్యారు. ఇటీవలే 'గద్దలకొండ గణేష్' సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న ఈ యువ హీరో ప్రెజెంట్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ‘గని' మూవీ చేస్తున్నారు. దీంతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో F3 సినిమాలో భాగమవుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bWV4Z3

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....