Saturday, 20 March 2021

Jathi Ratnalu: అరర్రరే జాతిరత్నాలు.. చుక్కలు చూపినారు జానెజిగర్ దోస్తులు.. లేటెస్ట్ వీడియో హల్చల్

జాతిరత్నాలుగా జోగిపేట గల్లీ పోరగాళ్ల హవా మామూలుగా లేదు బాబోయ్!. రోజుకో కొత్త రికార్డు జేబులో పెట్టుకుంటూ తెగ హల్చల్ చేస్తున్నారు ఈ జానెజిగర్ దోస్తులు. లాక్‌డౌన్ కారణంగా మూతపడి బోసి పోయిన థియేటర్ల బూజు దులుపుతూ నవ్వుల హంగామా చేస్తున్నారు. సీటులో కూర్చున్న సగటు ప్రేక్షకుడి ఆనందం చూసి డాల్బీ సిస్టమ్స్‌ కూడా నోరెళ్లెబెట్టేస్తున్నాయి. వీళ్ళ గురించి ఇంతలా చెప్పడానికి ఒకే ఒక్క కారణం ఈ '' సినిమా కాసుల వర్షం కురిపించడమే. అయితే ఈ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న టీమ్ తాజాగా ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ చేసి మరోసారి ఆకట్టుకున్నారు. ''అరర్రరే జాతిరత్నాలు.. చుక్కలు చూపినారు జానెజిగర్ దోస్తులు'' అంటూ సాగిపోతున్న ఈ పాటలో జాతిరత్నాలు విజయం గురించి చెప్పారు. మామ సింగ్‌తో కలిసి ఈ జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవీ అందించిన లిరిక్స్ యమ అట్రాక్ట్ చేస్తున్నాయి. జాతి రత్నాలు గురించి రామ్‌ మిర్యాల ఇచ్చిన ప్రెజెంటేషన్ క్లాస్, మాస్ ఆడియన్స్‌కి యమ కిక్కిస్తోంది. దీంతో కొద్దిసేపటి క్రితమే విడుదలైన ఈ స్పెషల్ సాంగ్ క్షణాల్లో వైరల్ అయింది. ఈ వీడియోలో సినిమా ప్రమోషన్స్‌ టైమ్‌లోని విజువల్స్, షూటింగ్ క్లిప్స్, ఆడియన్స్ రెస్పాన్స్‌ చూపించారు. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మాణంలో స్వప్న సినిమా బ్యానర్‌పై జాతిరత్నాలు మూవీ రూపొందింది. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించగా హైదరాబాద్‌ అమ్మాయి ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. ఔట్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ జనానికి గిలిగింతలు పెడుతూ భారీ వసూళ్లు రాబడుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cPf0w5

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....