Saturday, 20 March 2021

Fahadh Faasil: అందరి అంచనాలు తలకిందులు.. పుష్పలో బన్నీతో తలపడేది ఇతడే.. సర్ ప్రైజ్ వీడియో

లెక్కల మాస్టర్ సుకుమార్ లెక్కలన్నీ కూడా అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. సుకుమార్ తన సినిమా కోసం ఎంత ఆలోచిస్తాడు.. ప్రతీ ఒక్క పాత్రను ఎలా మలుచుతాడో అందరికీ తెలిసిందే. తన సినిమాల్లోని పాత్రలు, ఆ క్యారెక్టర్స్‌ను పోషించేవారిపై సుకుమార్ ప్రత్యేక దృష్టిని పెడుతుంటారు. అలా సుకుమార్ ప్రస్తుతం పుష్ప సినిమా కోసం నిరంతరం శ్రమిస్తున్నాడు. ఇంత వరకు పుష్ప రాజ్‌గా బన్నీ మానియాను చూపించాడు సుకుమార్. పోస్టర్లతోనే సినిమా స్థాయిని ఆకాశంలో పెట్టేశారు సుకుమార్. హీరోయిన్ రష్మిక మందాన్నతోనూ కొత్త ప్రయోగం చేస్తోన్నట్టు తెలుస్తోంది. అయితే ఇంత వరకు పుష్ఫ గురించి ఎన్నో లీకులు వచ్చాయి. పుష్ప సినిమాలో బన్నీతో తలపడేవారు ఎవరు? అని రకరకాల పేర్లు సోషల్ మీడియాలో బయటకు వచ్చాయి. బన్నీ కోసం బాలీవుడ్ స్టార్ హీరోను తీసుకురానున్నాడని టాక్ వచ్చింది. మొదటగా విజయ్ సేతుపతిని అనుకున్నారని, కానీ డేట్స్ సమస్య రావడంతో ఆయన తప్పుకున్నారని టాక్ బయటకు వచ్చింది. ప్రస్తుతం పుష్ప నుంచి అసలు సిసలు అప్డేట్ వచ్చింది. బన్నీతో తలపడే స్థాయి ఉన్న నటుడినే సుకుమార్ రంగంలోకి దించాడు. మళయాలి స్టార్ హీరో, నటుడు ఫాహిద్ ఫాజిల్‌ను పుష్ప కోసం తీసుకొచ్చాడు. పుష్పలో విలన్ రోల్ పోషించేది ఆయనే అని అధికారికంగా ప్రకటించారు. ఇక నటనకు మాలీవుడ్‌లో ఫాహిద్ ఫాజిల్ పెట్టింది పేరు. ఆయన నటనకు దేశం మొత్తం ఫిదా అవుతుంటుంది. ఇక ఇప్పుడు పుష్ప సినిమాతో మరోసారి తన సత్తానుచాటేందుకు రెడీ అయ్యారు. మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న పుష్ప మూవీ ఆగస్ట్ 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3f22wnA

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....