Sunday, 7 March 2021

మహిళా దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పెషల్ ట్రీట్.. ముగ్గురు హీరోయిన్స్‌తో పవర్ స్టార్ అలా!!

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'పింక్' రీమేక్‌గా '' తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాతో రీ- ఎంట్రీ ఇస్తున్నారు. దీంతో ఏడాది కాలంగా మెగా ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. చిత్రానికి బోనీకపూర్ సమర్పకులుగా వ్యవహరిస్తుండగా.. దిల్ రాజు నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. గతేడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం కానుకగా ఈ సినిమా నుంచి 'మగువా మగువా' సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్.. ఈ ఏడాది ఉమెన్స్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్‌తో సర్‌ప్రైజ్ చేశారు. తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు ముగ్గురు హీరోయిన్లు నివేదా థామస్, అంజలి, అనన్య నాగేళ్ల దర్శనమిచ్చారు. లాయర్ గెటప్‌లో పవన్ మధ్యలో కూర్చొని ఉండగా ఆ ముగ్గురు హీరోయిన్స్ వెనకాల నిల్చొని కనిపించారు. చిత్రంలో ఈ ముగ్గురు నటీమణులు వ్యభిచార గృహాల్లో చిక్కుకున్న అమ్మాయిల్లా నటిస్తుండగా.. వీరికి న్యాయం చేసే లాయర్ రోల్ పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారట. పవన్‌తో పాటు ఈ ముగ్గురు హీరోయిన్స్ క్యారెక్టర్స్ కూడా సినిమాలో హైలైట్ కానున్నాయని సమాచారం. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అయింది. పవన్‌ని తిరిగి వెండితెరపై చూడబోతున్నామనే శుభవార్త మెగా అభిమానుల్లో జోష్ నింపింది. పైగా పవన్ మూడు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తాడని తెలుస్తుండటం వారిలో మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. ఫ్యాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో పవన్ భార్య మరో హీరోయిన్ శృతి హాసన్ కనిపించనుంది. ఏప్రిల్ 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ఈ 'వకీల్ సాబ్' మూవీని రిలీజ్ చేయబోతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3uZ1Gh7

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....