Saturday, 20 March 2021

మంచు లక్ష్మి మాస్ డాన్స్.. వామ్మో చించిపడేసిందిలే.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీకి ప్రత్యేకంగా గుర్తింపు ఉంటుంది. వారసత్వాన్ని కొనసాగిస్తూ విష్ణు, మనోజ్, ఇలా అందరూ కూడా సినీ రంగంలో తమ కంటూ ప్రత్యేక ముద్రను వేశారు. అయితే మరీ ముఖ్యంగా మంచు లక్ష్మీ మాత్రం తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకుంది. మంచు లక్ష్మీపై సోషల్ మీడియాలో ఎంతగా ట్రోలింగ్ జరుగుతూ ఉంటుందో అందరికీ తెలిసిందే. నిలదిస్ ఫై, అలా దొర్లాలి అంటూ ఆమె స్టైల్లో మాట్లాడటం, ఆమె యాస, భాష అన్నీ కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతుంటాయి. అయితే మంచు వారు ఎప్పుడూ కూడా ట్రోలింగ్‌ను పాజిటివ్‌గానే తీసుకుంటారు. అవి శ్రుతిమించినప్పుడు వాటికి అంతే స్థాయిలో కౌంటర్లు కూడా ఇస్తుంటారు. ప్రస్తుతం మంచు ఫ్యామిలీ వేడుకలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. (మార్చి 19) సందర్భంగా సెలెబ్రేషన్స్ ఓ రేంజ్‌లో జరిగాయి. ప్రతీ ఏడాది మాదిరిగా ఈ సారి కూడా తమ విద్యా సంస్థలైన విద్యానికేతన్‌లో మోహన్ బాబు బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేశారు. విద్యానికేతన్‌లో సాంస్క‌ృతిక కార్యక్రమాలు, రక్తదానాలు, విద్యార్థుల ఆటపాటలు ఇలా ఆ ప్రాంగణం అంతా కూడా పండుగ వాతావరణం నెలకొంది. ఇక మేళతాళాలతో మోహన్ బాబు పుట్టిన రోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అవన్నీ ఒకెత్తు అనుకుంటే.. మంచు లక్ష్మీ, ఆమె ముద్దుల తనయ విద్యా నిర్వాణ ఇద్దరూ వేసిన స్టెప్పులు మరో ఎత్తు. మంచు లక్ష్మీ వేసిన స్టెప్పులు, మేళతాళాలకు అనుగుణం కాలు కదిపిన తీరు చూసి అందరూ ఫిదా అవుతున్నారు. మంచు లక్ష్మీ మాస్ యాంగిల్ వేరే లెవెల్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక మంచు లక్ష్మీ ఇలా ఉంటే.. ఆమె కూతురు నిర్వాణ స్టెప్పులతో దుమ్ములేపింది. ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.. ఈ వేడుకలు బాగా నచ్చినట్టున్నాయ్ అంటూ మంచు లక్ష్మీ పేర్కొంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3r9eNJ7

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....