Sunday, 7 March 2021

ముదురుతున్న 'సారంగ దరియా' వివాదం.. ఈ పాటకు కర్తను నేనే.. మాట మార్చారంటూ బోరున ఏడ్చిన కోమలి

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'లవ్ స్టోరీ' సినిమా నుంచి రీసెంట్‌గా విడుదలైన 'సారంగ దరియా' సాంగ్ సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతోంది. ఓ వైపు వేగంగా వ్యూస్ రాబడుతూ రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ సాంగ్ మరోవైపు వివాదంలో చిక్కుకొని జనాల్లో పలు చర్చలకు తావిచ్చింది. ఈ సాంగ్ సేకరించారని చిత్రయూనిట్ చేసిన ప్రకటనపై వరంగల్ జిల్లా కేసముద్రం మండలానికి చెందిన అనే అమ్మాయి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నేనే ఈ పాటకు కర్తను అంటూ ఆమె మీడియా ముందుకొచ్చింది. తమ సినిమా కోసం ఈ సాంగ్‌ని వాడుకుంటున్నట్లు తనకు చెప్పే సుద్దాల అశోక్ తేజ సేకరించినట్లుగా పేరు వేసుకున్నామని వాళ్ళు చెబుతున్న మాటలు అబద్దం అని కోమలి వాపోయింది. ప్రోమో చూశాకనే తాను సేకరించిన సాంగ్ ఇలా వాడేశారని తెలిసిందని, వెంటనే అశోక్ తేజ గారికి ఫోన్ చేసి మాట్లాడితే సరైన స్పందన రాలేదని ఆమె చెప్పుకొచ్చింది. ప్రోమో వచ్చాక శేఖర్ సార్ పాడతావా? అని అడిగారు కానీ గొంతు బాగా లేదు ఓ పది రోజులు టైమ్ ఇవ్వండని అడిగితే.. ఇప్పుడైతే సమయం లేదు ఆడియో ఫంక్షన్‌లో పాడిస్తాం. అలాగే అశోక్ తేజ గారి పక్కనే నీ పేరు కూడా వేస్తాం. తరువాతి సినిమాలో ఛాన్స్ ఇస్తామని శేఖర్ కమ్ముల అన్నారని కోమలి తెలిపింది. కానీ ఇప్పుడు మాట మార్చి తనకు క్రెడిట్ ఇవ్వడం లేదంటూ ఓ మీడియా ఇంటర్వ్యూలో లైవ్ లోనే ఏడ్చేసింది కోమలి. ఇప్పటికైనా తాను కోరుకునేది ఒక్కటే అని, తన పేరు కూడా చిత్రంలో వేయాలని కోరింది. ఇప్పుడు మంగ్లీ పాడిన పాటలో ఫోక్ లేదని, పల్లెదనం లేదని.. ఆమె పాడిన పాట ఏమీ బాగాలేదని కోమలి చెప్పింది. ఈ పాట మాత్రం తనకు నచ్చలేదంటూ ఓపెన్ అయింది. ఈ పరిణామాల నడుమ 'సారంగ దరియా' సాంగ్ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది. గతంలో 'రేలా రే' ప్రోగ్రాంలో మొదటిసారి ఈ 'సారంగ దరియా' జానపదాన్ని పాడి జనానికి వినిపించింది కోమలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3c7rkHQ

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....