Monday, 8 March 2021

హీరోయిన్ కావాలంటే అవి పెద్దగా ఉండాలన్నారు.. ఎద అందాలపై ఇలియానా బోల్డ్ కామెంట్స్

శృంగారం, శరీరాకృతి, డేటింగ్ ఇలా ఎలాంటి విషయాన్నైనా ఓపెన్‌గా మాట్లాడే హీరోయిన్స్ లిస్ట్‌లో ముందు వరుసలో ఉంటుంది గోవా బ్యూటీ . అప్పట్లో 'దేవదాస్' సినిమాతో టాలీవుడ్ తెరకు కొత్త అందాల రుచి చూపించి వావ్! అనిపించిన ఈ హీరోయిన్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడుతూ బాడీ షేమింగ్ విషయమై బోల్డ్ కామెంట్స్ చేసింది ఇలియానా. ఆ మధ్య విదేశీ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో డేటింగ్ చేసి శరీరాకృతిపై అంతగా శ్రద్ద పెట్టని ఇల్లీ బేబీ కాస్త బొద్దుగా తయారైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అతనితో బ్రేకప్ చేసుకొని ఫిట్‌నెస్‌పై స్పషల్ కేర్ తీసుకుంది. తెలుగులో 'అమర్ అక్బర్ ఆంటోనీ' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె, తిరిగి తన పూర్వపు శరీరాకృతిని సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఇలియానా షేర్ చేస్తున్న లేటెస్ట్ ఫొటోస్ చూస్తుంటే ఇల్లీ బేబీ మళ్లీ పదేళ్లు వెనక్కి వెళ్లిందని అర్థమవుతోంది. అయితే ఒక దశలో తన శరీరం పట్ల అసంతృప్తిగా ఉండేదట ఇలియానా. చాలామంది ఆమెను హేళన చేసేవారట. ఈ విషయాలన్నీ తెలుపుతూ ఆమె ఓపెన్ అయింది. `బాడీ డిస్‌మార్ఫియా` అనే ఫోబియా గురించి మాట్లాడిన ఇలియానా.. కొంత మంది అమ్మాయిలు తమకు మంచి శరీర సౌష్టవం ఉన్నా, ఉండాల్సిన కొలతల్లోనే శరీర భాగాలున్నా తమ శరీరం గురించి ఒకరకమైన అసంతృప్తికి గురవుతుంటారు. దానినే `బాడీ డిస్‌మార్ఫియా` అంటారని చెప్పింది. ఒకానొక సమయంలో తానూ అలాగే ఫీల్ అయ్యేదాన్నని, ఇప్పుడు తన శరీరం పట్ల గర్వంగా ఫీలవుతున్నానని పేర్కొంది. మొదట్లో తనది హీరోయిన్‌కి కావాల్సిన బాడీ కాదని, హీరోయిన్ కావాలనే వక్షోజాలు పెద్దగా ఉండాలి అవి నీకు లేవంటూ చాలా మంది విమర్శించారని చెప్పుకొచ్చింది ఇలియానా. అయితే తన బాడీలో కూడా బ్యూటీ స్పాట్స్ ఉన్నాయని.. కానీ వాటిని కాకుండా లోపాలను మాత్రమే ఎత్తిచూపడం సరికాదని తనపై వస్తున్న ట్రోల్స్‌పై ఆవేదన వెళ్లగక్కింది ఇలియానా. ప్రస్తుతం 'బిగ్‌బుల్' అనే మూవీలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటిస్తోంది ఇలియానా.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3enGtHt

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....