Sunday, 7 March 2021

బన్నీ తెలుగు అమ్మాయే కావాలన్నారు.. కానీ రష్మికను తీసుకున్నాం.. 'పుష్ప' మూవీపై సుకుమార్ ఓపెన్

హీరోగా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ 'పుష్ప'. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించనుండగా, పల్లెటూరి పిల్లలా రష్మిక అలరించనుంది. అయితే షూటింగ్‌కి ముందు ఈ సినిమాలో తెలుగు అమ్మాయిని తీసుకోవాలని బన్నీ పట్టుబట్టారట. కానీ కొన్ని కారణాల వల్ల రష్మికను తీసుకోవాల్సి వచ్చిందని తెలుపుతూ సుకుమార్ తాజాగా ఓపెన్ అయ్యారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్నేహితుడు, ఆర్య సినిమా సమయం నుంచి ఆయన వద్ద పనిచేసిన హరిప్రసాద్‌ జక్కా ‘ప్లేబ్యాక్‌’ అనే మూవీ రూపొందించి రిలీజ్ చేశారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేయగా, సుకుమార్ హాజరై హరిప్రసాద్‌పై, అలాగే ఈ మూవీలో హీరోయిన్‌గా నటించిన అనన్యపై ప్రశంసలు గుప్పించారు. అనన్య ఎంతో చక్కగా నటించిందని, తన సినిమాల్లో తెలుగు సరిగా రాని హీరోయిన్లను పెట్టుకోవడం వల్ల వారితో డైలాగ్స్ చెప్పించడం కష్టంగా ఉంటుందని సుకుమార్ అన్నారు. వీలైనంతవరకు తన తర్వాతి సినిమాల్లో తెలుగు హీరోయిన్‌నే తీసుకుంటానని చెప్పారు. హరిప్రసాద్‌కి, తనకు మధ్య మంచి కమిట్మెంట్ ఉంటుందని చెప్పిన సుకుమార్.. అతను కథ రాసి ముందు చెబుతాడు. నేను డైరెక్ట్ చేస్తానంటే వదిలేస్తాడు.. నేను చేయనంటే అతను చేస్తాడు అని చెప్పుకొచ్చాడు. అలా ఈ 'ప్లే బ్యాక్' కథ కూడా తానే చేయాల్సింది.. కానీ కొన్ని కమిట్మెంట్స్ వల్ల నేను చేయలేకపోయానని, అందుకే హరినే చేయమంటే చేసేశాడంటూ అసలు విషయం చెప్పుకొచ్చారు సుక్కు. ఏదేమైనా సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తెలుగు హీరోయిన్స్ గురించి మాట్లాడటం తెలుగు అమ్మాయిలను ఎంతో సంతోష పెడుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3sUIlf5

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....