Thursday, 18 March 2021

భార్యతో రొమాంటిక్‌గా.. దాని కోసమే అంటూ సామ్రాట్ పాట్లు

ఫేమ్ సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉండరు. కానీ రెండో పెళ్లి తరువాత మాత్రం గేర్ మార్చేశారు. సోషల్ మీడియాలో తన పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా పోస్ట్‌లు చేస్తున్నారు. పెళ్లి జరిగి నెల అయింది.. రెండు నెలలు అవుతోంది అంటూ ప్రతీ నెలా స్పెషల్ పార్టీలు చేసుకుంటున్నారు. వాటికి సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ తమ వైవాహిక జీవితం సంతోషంగా సాగుతోందన్నట్టు చెప్పకనే చెప్పేస్తున్నారు. మామూలుగా ఈ మధ్య పెళ్లిళ్లు అంటే ఓ ట్రెండ్ కొనసాగుతోంది. వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్ షూట్ అంటూ రకరకాలుగా చేస్తున్నారు. అయితే సామ్రాట్ పెళ్లి చేసుకునే సమయానికి కరోనా ఉధృతి తీవ్రంగా ఉంది. అందుకే ఆ సమయంలో ఇలాంటి షూట్‌లు నిర్వహించలేదు. కానీ ఇప్పుడు ఆ తంతును కానిచ్చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కాస్తా.. పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్ అయిపోయింది. ఈ మేరకు సామ్రాట్ షేర్ చేస్తోన్న ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. మామూలుగానే వీకెండ్స్ అంటూ ఈ కొత్త జంట రచ్చరచ్చ చేస్తుంటారు. పార్టీలకు వెళ్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా ఇప్పుడు పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్ అంటూ బయటకు వెళ్లారు. అక్కడ రకరకాల పోజులు పెడుతూ రచ్చ చేస్తున్నారు. కాకినాడకు చెందిన అనే అమ్మాయిని గతేడాది నవంబర్‌లో సామ్రాట్ వివాహాం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక సామ్రాట్ వైవాహిక జీవితం, హర్షితతో మొదటి పెళ్లి, దాని చుట్టూ అల్లుకున్న వివాదాలు, ఆ పెళ్లిని విడాకులతో ముగింపు పలకడం అందరికీ తెలిసిందే. పంచాక్షరీ, బావ వంటి సినిమాల్లో స్పెషల్ రోల్ చేసి సామ్రాట్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్ బాస్ తరువాత ఆ ఇమేజ్ మరింత పెరిగింది కానీ తెరపై మాత్రం అంతగా అవకాశాలను మాత్రం తెచ్చిపెట్టలేకపోయింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bXY9YS

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....