Wednesday, 24 March 2021

అది ఎవరి సొంతమంటూ సమంత- నాగచైతన్య మధ్య గొడవ.. మా సమస్య అదేనంటూ క్లారిటీ ఇచ్చిన అక్కినేని కోడలు

సమంత-నాగ చైతన్య జంట గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒకరు సోషల్ మీడియాలోనే గడిపేస్తుంటే ఇంకొకరు సోషల్ మీడియాలో ఆమడ దూరంలో ఉంటారు. ఒకరు ఎప్పుడూ లైమ్ లైట్‌లోనే ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు.. మరొకరు ఈ ప్రపంచానికి దూరంగా తన ప్రపంచం ఏదో తానే అన్నట్టుగా ఉంటారు. సోషల్ మీడియాలో ఎక్కువగా గడుపుతంటారు. కానీ మాత్రం ఎప్పుడో అలా ఒక పోస్ట్ చేస్తుంటారు. అయితే ఈ ఇద్దరూ మాత్రం జంతు ప్రేమికులు. మూగ జీవాలంటే ఇద్దరికీ మహా ఇష్టం. వారి ఇంట్లో అనే పెట్ ఉంటుందన్న విషయం తెలిసిందే. హష్‌ను తన పిల్లాడిగా చూసుకుంటుంటారు. అలా హష్ తనకు చేసే సాయం, అల్లరి గురించి సమంత ఎప్పుడూ చెబుతుంటారు. లాక్డౌన్ సమయంలో హష్ చేసిన పనులను వీడియో రూపంలో తన అభిమానులతో షేర్ చేశారు సమంత. అంతే కాకుండా ఆ మధ్య వచ్చిన సామ్ జామ్ షోలోనూ నాగ చైతన్యతో హష్ గురించి గొడవపడ్డారు సమంత. హష్‌కు ఎవరు అంటే ఇష్టం.. నేనే కదా?.. నా చుట్టే తిరుగుతూ ఉంటాడు కదా? అని నాగ చైతన్యతో సమంత వాగ్వాదానికి దిగారు. వాడు నీ చుట్టూ తిరిగినా నాతోనే ఉంటాడు.. నేను అంటేనే ఇష్టమని నాగ చైతన్య అన్నారు. అలా హష్ గురించి ఈ ఇద్దరూ చర్చించారు. అయితే తాజాగా హష్‌ బొమ్మను సమంత, నాగ చైతన్యలకు గిఫ్ట్‌గా ఇచ్చారు ఓ డిజైనర్. క్రిష్ బజాజ్ జవేరి అనే డిజైనర్.. హష్ ప్రతిరూపాన్ని ఇచ్చారు. ఆ గిఫ్ట్‌ను చూసి సమంత మురిసిపోయింది. నా జీవితంలో ఇదే గొప్ప బహుమతి అని ఉప్పొంగిపోయారు. అయితే దీని వల్ల సమస్యలు వచ్చాయని తెలుస్తోంది. ఆ బొమ్మ ఎవరికి సొంతమని.. చైతన్య, నేను పోట్లాడుతున్నామని సమంత చెప్పుకొచ్చారు. అయితే ఈ గొడవలో ఎవరు గెలిచారో.. హష్ బొమ్మను ఎవరు తీసుకున్నారో మరి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vXHNYg

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....