Wednesday, 17 March 2021

BB3: సెట్‌లో ఉన్నంత సేపు బాలకృష్ణ.. ఆయనతో ఉంటే అదే ఫీలింగ్..! ప్రగ్యా జైస్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు

అందంతో పాటు అభినయం రెండూ ఉన్నాయని నిరూపించుకున్న 'కంచె' భామ అవకాశాలు పట్టేయడంలో మాత్రం కాస్త వెనకపడిందనే చెప్పుకోవాలి. వచ్చిన అవకాశాలతో స్టార్ స్టేటస్‌ అందుకోలేక ఇబ్బంది పడుతోంది ప్రగ్యా. ఈ పరిస్థితుల్లో ఆమెను ఏరికోరి తన భారీ సినిమా కోసం సెలక్ట్ చేశారు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. బాలయ్య సరసన హీరోయిన్‌గా ఆడిపాడిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో నందమూరి నటసింహంపై ప్రగ్యా జైస్వాల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా మీడియా ముందుకొచ్చిన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఓ అద్భుతమైన అనుభవం అని చెప్పింది. ఎనర్జీకే పవర్‌హౌస్‌ ఆయన అంటూ తెగ పొగిడేసింది. ఆయనతో సెట్‌లో ఉన్నంత సేపు ఎంతో పాజిటివ్‌గా అనిపిస్తుందని తెలుపుతూ నందమూరి అభిమానులను బుట్టలో వేసుకుంది ప్రగ్యా. బాలయ్య గురించి ఆమె చేసిన ఈ కామెంట్స్ చూసి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. బాలకృష్ణ- బోయపాటి కాంబోలో రాబోతున్న హాట్రిక్ మూవీ కావడంతో BB3పై ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. మిర్యాల స‌త్య‌నారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్ప‌ణ‌లో ద్వారక క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో ఈ మూవీ రూపొందుతోంది. ఈ భారీ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన ‘బీబీ3 ఫస్ట్ రోర్’ నందమూరి అభిమానుల అంచనాలకు రెక్కలు కట్టింది. ఈ చిత్రానికి 'మోనార్క్' అనే క్రేజీ టైటిల్ పరిశీలిస్తున్నట్లు టాక్. మరోవైపు కెరీర్‌లో ఎలాగైనా టర్న్ తీసుకోవాలనే కోణంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తూ అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తోంది ప్రగ్యా. సినిమాల సంగతి ఎలా ఉన్నా అందరి దృష్టి తనపై పడేలా చేసుకుంటోంది. సో.. చూడాలి మరి BB3 అయినా ప్రగ్యా కెరీర్‌కి బూస్టింగ్ ఇస్తుందా.. లేదా? అనేది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Qhduvb

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....