2003 సంవత్సరంలో 'ఎవరే అతగాడు' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ .. ఆ తర్వాత కొన్నేళ్లపాటు వెండితెరపై హవా కొనసాగించింది. గ్లామరస్ హీరోయిన్‌గా స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ బిజీ హీరోయిన్ అయ్యాక పెళ్లి చేసుకున్న ఆమె.. పెళ్లి తర్వాత తన సినిమాల జోరు తగ్గించింది. ముస్లిం యువకుడిని పెళ్లాడిన ప్రియమణి ఆ తరువాత సినిమాలకు కాస్త దూరంగా ఉంటూనే బుల్లితెర షోస్ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. అలాగే అవకాశం ఉన్నప్పుడల్లా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు టచ్ లోకి వస్తోంది. ఈ క్రమంలో తిరిగి సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్దమైన ఆమె.. అందుకు తగినట్లుగా ప్లాన్ చేసుకుంటూ సినిమాల ఎంపిక చేసుకుంటోంది. మరింత స్లిమ్‌గా కనిపించేందుకు గాను తన శరీరాకృతిపై కూడా ప్రత్యేక శ్రద్ద పెడుతోంది. తాజాగా తన సెకండ్ ఇన్నింగ్స్ విషయమై స్పందించిన ప్రియమణి.. కథ డిమాండ్ చేస్తే ఎక్స్‌పోజింగ్, గ్లామర్ రోల్స్ చేసేందుకు రెడీ ఉన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తన గ్లామర్ ఫొటో షూట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ప్రియమణి చేతిలో దక్షిణాది భాషలతో పాటు, హిందీ కలుపుకుని సుమారు ఆరు వరకు సినిమాలున్నాయని తెలుస్తోంది. తెలుగులో రానా హీరోగా వస్తున్న విరాటపర్వం, అలాగే విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందుతున్న నారప్ప సినిమాల్లో ప్రియమణి నటిస్తోంది. అలాగే దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న ‘తలైవి’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Y8y1CL
No comments:
Post a Comment