
మెగాస్టార్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా ''. గత కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం ఈ సినిమా యూనిట్ హైదరాబాద్ శివారులోని కోకాపేటలో ఉన్నారు. అక్కడ సెలక్ట్ కొన్ని లొకేషన్స్‌లో చిరంజీవిపై కీలక సన్నివేశాల చిత్రీకరణ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ షూటింగ్ లొకేషన్స్‌లో తెలంగాణ రాష్ట్ర మంత్రి కనిపించడంతో ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 'ఆచార్య' సెట్స్ పైకి వెళ్లి చిరంజీవితో సరదాగా ముచ్చటించిన విషయాన్ని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడిస్తూ కొన్ని ఫొటోలు పంచుకున్నారు. షూటింగ్ లొకేషన్‌కి వెళ్లి చిరంజీవితో పాటు ఆచార్య సినిమా దర్శకుడు కొరటాల శివను కలిసి కాసేపు ఆయన మాట్లాడారు. ఈ మేరకు 'ఆచార్య' సక్సెస్ కావాలని కోరుకుంటూ చిత్రయూనిట్ మొత్తానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ''ఆచార్య చిత్ర యూనిట్‌తో చిరు హాసం.. మెగాస్టార్ చిరంజీవి గారి చిత్రం ఆచార్య చిత్రం విజయవంతం కావాలని కోరుతూ..'' అంటూ ఆయన ట్వీట్ చేశారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, రామ్‌చరణ్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ 'ఆచార్య' మూవీలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మణిశర్మ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఇక, రామ్ చరణ్ కీలకపాత్రలో కనిపించనుండటం సినిమాపై ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్రయూనిట్.. మే 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39uc9bA
No comments:
Post a Comment