Sunday, 31 January 2021

చావు కబురు చల్లగా: కార్తికేయ, లావణ్య త్రిపాఠి ప్రేమకు ముహూర్తం.. బ్యూటిఫుల్ రాక్షసి అంటూ హీరో ట్వీట్

RX 100 సినిమాతో ఎంట్రీ ఇచ్చి యూత్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేశాడు యంగ్ హీరో కార్తికేయ. ఆ తర్వాత గుణ 369, 90 ML, హిప్పీ లాంటి డిఫరెంట్ మూవీస్ చేసిన ఆయన ఇప్పుడు '' అంటూ మరో విలక్షణ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో జంటగా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ కావడంతో తాజాగా చిత్ర రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. మర్చి 19వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు పేర్కొంటూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు హీరో కార్తికేయ. ''ఈ మార్చి 19కి చావు కబురు చల్లగా చెప్పడానికి బాలరాజు గాడు, మల్లిక థియేటర్లలోకి వస్తున్నారు. బిగ్ బ్యానర్ గీత ఆర్ట్స్‌లో ఈ సినిమా చేయడం, బ్యూటిఫుల్ రాక్షసి లావణ్య త్రిపాఠితో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది'' అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. మరోవైపు ఇదే విషయాన్ని తెలుపుతూ లావణ్య తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టింది. మీ అందరినీ మార్చి 19న మళ్ళీ థియేటర్స్‌లో కలవనుండటం చాలా థ్రిల్లింగ్‌గా ఉందని ఆమె పేర్కొంది. డిఫరెంట్ టైటిల్‌లో వస్తున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి నర్సుగా నటిస్తుండగా, బస్తీ బాలరాజు రోల్‌లో మార్చురీ వ్యాన్ నడిపే డ్రైవర్‌గా కార్తికేయ కనిపించనున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై యువదర్శకుడు కౌశిక్ పెగల్లపాటి‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. జాక్స్ బిజోయ్ బాణీలు కడుతున్నాడు. ఇక ఈ చిత్రంలో హాట్ యాంకర్ అనసూయ ఐటమ్ సాంగ్ చేస్తుందని సమాచారం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NGMvrt

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....