Saturday, 30 January 2021

అఫీషియల్: రవితేజ సినిమాలో అర్జున్.. ఖిలాడీ క్లబ్‌లో చేరిపోయిన యాక్షన్ కింగ్

సౌత్ ఇండియన్ తెరపై అంటే ఓ స్పెషల్ ఇమేజ్ ఉంటుంది. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోగల సత్తా ఉండటంతో యాక్షన్ కింగ్ అని పిలిపించుకుంటూ ప్రేక్షకలోకాన్ని అలరిస్తున్నారు అర్జున్. పాత్ర పరిధి ఎంతనేది పక్కనబెట్టి ఆ రోల్ నచ్చితే చాలు వెంటనే ఓకే చెప్పేస్తున్న ఆయన.. రీసెంట్‌గా హీరోగా తెరకెక్కుతున్న '' మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటిస్తూ ఆయనకు స్వాగతం పలికింది 'ఖిలాడీ' యూనిట్. ఖిలాడీ క్లబ్‌కి స్వాగతం అని పేర్కొంటూ అర్జున్‌, ఈ మూవీ టైటిల్‌తో కూడిన ఓ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు డైరెక్టర్ రమేష్ వర్మ. దీంతో తమ అభిమాన హీరో మూవీలో అర్జున్ కూడా నటిస్తున్నారని తెలిసి మాస్ మహారాజ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ భాగం కావడం ఆనందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా అల్లు అర్జున్ హీరోగా వచ్చిన `నా పేరు సూర్య` తర్వాత మరోసారి ఈ 'ఖిలాడీ'తో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు అర్జున్. ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై జయంతి లాల్‌ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ 'ఖిలాడీ' సినిమాలో రవితేజ రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించనున్నారు. ఆయన సరసన మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ బాణీలు కడుతున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్‌లుక్, ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి. మాస్ మహారాజ్ కెరీర్‌లో 67వ సినిమాగా ఈ 'ఖిలాడీ' రూపుదిద్దుకుంటోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39xX4FT

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...