
బుల్లితెరపై మాటల తూటాలతో అలరించి తనకంటూ ప్రత్యేక అభిమాన వర్గాన్ని కూడగట్టుకున్న వెండితెరపై కూడా టాలెంటెడ్ యాక్టర్ అనిపించుకుంటున్నాడు. హీరోగా ఆరంగేట్రం చేసిన తొలి సినిమాతోనే పలువురి ప్రశంసలు పొందుతున్నాడు. ఆయన హీరోగా శుక్రవారం విడుదలైన '?' మూవీ తొలిరోజే సక్సెస్ టాక్ తెచ్చుకొని విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. నిజానికి ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా థియేటర్స్ మూతబడటంతో వాయిదాపడి చివరకు ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన ''నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా..'' సాంగ్ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకొని సినిమాపై హైప్ పెంచేసింది. దీంతో తొలిరోజే ఈ మూవీ రూ.4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సత్తా చాటింది. చిత్రంలో హీరోగా ప్రదీప్ నటన చాలా బాగుందనే టాక్ వచ్చింది. దీంతో ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు ప్రదీప్. ''ఒక చిన్న సినిమాకు విశేష స్పందన రావడం ఆనందంగా ఉంది. ఎన్నోరోజుల కల ఇది. మీ అందరి సహకారంతోనే ఈ రోజు సాధ్యమైంది. నీ కెరీర్‌లో పడిన అతిపెద్ద అడుగుకు ఇంతటి సపోర్ట్ అందడం చాలా సంతోషంగా అనిపిస్తోంది. ప్రేక్షకులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎప్పటికీ మిమ్మల్ని ఇలాగే ఎంటర్‌టైన్ చేస్తూనే ఉంటాను'' అని ప్రదీప్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' సినిమాతో సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన మున్నా దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఎస్.వి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్.వి.బాబు నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీలో ప్రదీప్ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3crD7Cv
No comments:
Post a Comment