Sunday, 31 January 2021

బాలయ్య స్టైలిష్ లుక్ అదుర్స్.. ఎన్టీఆర్ జయంతి నాడే BB3 రిలీజ్

‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ త‌ర్వాత‌ నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ BB3 (వర్కింగ్ టైటిల్). మిర్యాల స‌త్యనారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్పణ‌లో ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పుట్టిన‌రోజు కానుక‌గా విడుదల చేసిన ‘BB3 ఫస్ట్ రోర్’ టీజ‌ర్‌కి అద్భుతమైన స్పందన వ‌చ్చింది. ఈ సినిమాకు సంబంధించి ఒక ఎగ్జయిటింగ్ అప్‌డేట్‌ను ఆదివారం మధ్యాహ్నం 3:36 గంటలకు అందిస్తామని చిత్ర నిర్మాణ సంస్థ ఉదయం ప్రకటించింది. అన్నట్టుగానే విడుదల తేదీతో పాటు బాలకృష్ణ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని మే 28న ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌ చేస్తున్నట్టు అధికారికంగా ప్రక‌టించారు. టీజ‌ర్‌లో మాస్‌ లుక్‌లో అద‌ర‌గొట్టిన బాలయ్య.. ఇప్పుడు ఈ కొత్త పోస్టర్‌లో స్టైలిష్‌ లుక్‌లో ఫ్యాన్స్‌ని అల‌రిస్తున్నారు. జేబులో చేయిపెట్టుకుని న‌డిచివ‌స్తున్న బాల‌య్య స్టైలిష్‌ లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. మే 28 విశ్వవిఖ్యాత న‌ట‌సార్వభౌమ, న‌ట‌ర‌త్న నందమూరి తారక రామారావు జ‌యంతి కావ‌డం విశేషం. విడుదల తేదీ ప్రకటన సందర్భంగా చిత్ర నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘సింహా, లెజెండ్ సినిమాల త‌ర్వాత బాల‌కృష్ణ, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మ‌రో సూప‌ర్‌ సెన్సేష‌న‌ల్ మూవీ ఇది. మా ద్వార‌కా క్రియేష‌న్స్ బేన‌ర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ తారాగ‌ణంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఫిబ్రవ‌రి సెకండ్ వీక్ నుండి ఫైన‌ల్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి స‌మ్మర్ స్పెష‌ల్‌గా మే28న ఈ చిత్రాన్ని ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌చేస్తున్నాం’’ అని అన్నారు. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్‌తో పాటు భారీ తారాగ‌ణం న‌టిస్తోంది. ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రానికి సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం.రత్నం మాటలు రాశారు. ఎ.ఎస్.ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్. కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు ఎడిటర్లు. రామ్-లక్ష్మణ్ మాస్టర్లు ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3iZYX1e

No comments:

Post a Comment

'Most Dargahs And Mosques Will Be Threatened'

'The new Waqf bill sows the seed for conflict in every town and village of India.' from rediff Top Interviews https://ift.tt/UcHi9...