Sunday, 31 January 2021

బెండకాయ దొండకాయ నువ్వు నా గుండెకాయ: అల్లు అర్హ అల్లరి వీడియో.. బన్నీ ఎమోషనల్

గారాలపట్టి అల్లు అర్హ తండ్రితో కలిసి ఎంత అల్లరి చేస్తుందో చెప్పాల్సిన అవసరంలేదు. అర్హతో తీసుకున్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మురిసిపోతూ ఉంటారు బన్నీ. అర్హ ముద్దు ముద్దు మాటలకు బన్నీ ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతుంటారు. తాజాగా అర్హ వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు అల్లు అర్జున్. ఈ వీడియోలో అర్హ చిలిపిగా చెప్తున్న డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ‘బెండకాయ దొండకాయ నువ్వు నా గుండెకాయ’ అని తన తండ్రిని ఉద్దేశించి వీడియోలో అర్హ అంటోంది. ఆమె చిలిపిగా ఆ డైలాగ్ చెప్పగానే వీడియో తీస్తున్న బన్నీ నవ్వు ఆపుకోలేకపోయారు. వాస్తవానికి ఇది గతేడాది మార్చి 1న తీసిన వీడియో అట. కానీ, బన్నీ ఇప్పుడు పోస్ట్ చేశారు. దీనికి కారణం ఉంది. అల్లు అర్జున్ మళ్లీ ‘పుష్ప’ షూటింగ్‌లో పాల్గొనడానికి వెళ్లారు. తన టీమ్‌తో కలిసి ఆయన కేరళ వెళ్లినట్టు సమాచారం. ఇది కాస్త పెద్ద షెడ్యూల్ అట. అందుకే, ఆ వీడియోను షేర్ చేసి దాని మీద ‘ఐ మిస్ యు అర్హ’ అని రాశారు బన్నీ. తన గారాలపట్టి అల్లరిని మిస్ అవుతున్నందుకు ఆయన కాస్త ఎమోషనల్ అయ్యారు. కానీ, అర్హ వీడియో చూసిన వాళ్లకు బన్నీ ఎమోషన్ కనబడదు.. ఆమె చిలిపితనం మాత్రమే కనిపిస్తుంది. ఇదిలా ఉంటే, ‘పుష్ప’ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. బన్నీ-సుక్కు కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రమిది. దీంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి. ఈ సినిమాను ఆగస్టు 13న విడుదల చేస్తున్నట్టు రెండు రోజుల క్రితమే చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని ముత్తంశెట్టి మీడియా సౌజన్యంతో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NTDQCf

No comments:

Post a Comment

When Saif Ali Khan Was 'Homeless And Penniless'

'One day, I was working in my office late in the evening when suddenly the peon comes and says Saif Ali Khan has come to meet you.' ...