
పాపులర్ యాంకర్ హీరోగా పరిచయం అవుతోన్న సంగతి తెలిసిందే. ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ అని గతేడాది నుంచి ఊరిస్తున్నారు ప్రదీప్. కిందటేడాదే పూర్తయిన ఈ సినిమా కరోనా మహమ్మారి వల్ల థియేటర్లు మూతబడటంతో విడుదల వాయిదా పడింది. ఓటీటీ ఆఫర్లు వచ్చినా తమ సినిమాపై ఉన్న నమ్మకంతో కచ్చితంగా థియేటర్లలోనే విడుదల చేయాలని ఇంత వరకు ఆగారు నిర్మాతలు. మొత్తానికి ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం’ పాట ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా కూడా ఆ పాటంత బాగుంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఒక ప్రమోషనల్ సాంగ్‌ను మంగళవారం విడుదల చేశారు. ‘వా వా మేరే బావ’ అంటూ సాగే ఈ పాటను ఒకే ఒక్క టేక్‌లో చిత్రీకరించడం విశేషం. ఈ హుషారైన పాటలో స్టార్ యాంకర్లు అనసూయ, శ్రీముఖి, రష్మి కూడా భాగమయ్యారు. వీరి ముగ్గురితో ప్రదీప్ స్టెప్పులేశారు. ఇదిలా ఉంటే, ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ చిత్రంలో ప్రదీప్ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించారు. సుకుమార్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన మున్నా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. కన్నడలో పలు విజయవంతమైన సినిమాలు తీసిన ఎస్.వి.బాబు ఈ చిత్రాన్ని ఎస్.వి. ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. టాలీవుడ్‌లో భారీ నిర్మాణ సంస్థలు అయిన జీఏ2, యూవీ క్రియేషన్స్ ద్వారా ఈ సినిమా విడుదలవుతోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pm5ohw
No comments:
Post a Comment