Thursday 28 January 2021

దేశభక్తి ప్రధానాంశంగా 'సన్ ఆఫ్ ఇండియా'.. మోహన్ బాబు ఫస్ట్‌లుక్‌ రిలీజ్

దాదాపు నలభై ఏళ్లుగా నటుడిగా, నిర్మాతగా, సమర్పకుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న మంచు ఈ మధ్యకాలంలో కాస్త సినిమాల జోరు తగ్గించిన సంగతి తెలిసిందే. కొన్ని నెలలపాటు విరామం తీసుకున్న ఆయన తిరిగి ఓ స్ట్రాంగ్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దేశభక్తి ప్రధానాంశంగా రూపొందుతున్న '' మూవీ చేస్తున్నారు మోహన్ బాబు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్ రిలీజ్ చేశారు. శ్రీ ల‌క్ష్మీప్ర‌స‌న్న పిక్చ‌ర్స్‌, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మోహన్‌బాబుకు స్టైలిస్ట్‌గా ఆయన కోడలు మంచు విరానికా వ్యవహరిస్తుండగా.. మంచు విష్ణు నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసిన చిత్రయూనిట్.. తాజాగా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తో ఆకట్టుకుంది. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన మువ్వన్నెల జెండాపై ఉన్న సినిమా టైటిల్ దేశ ప్రజల ఆదరణ చూరగొంటోంది. ఇక మోహన్ బాబు సీరియస్ లుక్‌లో కనిపిస్తుండటం ఈ సినిమాలో దేశభక్తికి సంబంధించి ఏదో కీలక పాయింట్ చూపించబోతున్నారనే ఫీలింగ్స్ తెప్పిస్తోంది. నిజానికి 'సన్ ఆఫ్ ఇండియా' ఫస్ట్ లుక్ పోస్టర్ గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 26న విడుదల చేస్తారని అంతా భావించారు కానీ.. అందుకు ఓ మూడు రోజులు ఆలస్యమైనా ఈ పోస్టర్‌ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు. ఈ సినిమాకు గౌతంరాజు ఎడిటింగ్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తుండగా ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఇప్పటివరకు చూడని డిఫరెంట్ జానర్ ఇది అని, మోహన్ బాబు నటన అందరినీ ఆకట్టుకుంటూ మంచి మెసేజ్ ఇస్తుందని చెబుతున్నారు యూనిట్ సభ్యులు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3abmrwl

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz