Saturday 30 January 2021

Actress Hema: నేను తోపు.. పులి.. నా తరువాత ఎవరూ లేరు రారు: స్టేజ్‌పై హేమ కన్నీళ్లు

యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రం ఈ శుక్రవారం (జనవరి 29) విడుదలై మిక్స్డ్ టాక్ రాబట్టింది. ఈ చిత్రంలో హేమ యాంకర్ ప్రదీప్ తల్లి పాత్రలో అలరించింది. కొడుకుని విపరీతంగా ప్రేమించినా.. కొడుకు నుంచి తిరిగి ప్రేమను పొందుకోలేక కుమిలిపోయే అమ్మ పాత్రలో అద్భుతంగా నటించింది హేమ. ఆమె కెరియర్‌లోనే ఇది విభిన్న పాత్ర కాగా.. ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు చెప్తూ ఎమోషనల్ అయ్యింది హేమ. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? సక్సెస్ మీట్‌‌లో పాల్గొన్న హేమ మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యింది. ఇలాంటి పాత్ర కోసం గత ఏడేళ్లుగా ఎదురుచూస్తున్నా ఎవరూ ఇవ్వలేదని.. ఈ ఆనందం నాకు మూడు నందులకంటే ఎక్కువ అంటూ పొంగిపోయారు. హేమ మాట్లాడుతూ.. ‘నాకు రెండు మూడు నంది అవార్డులు వచ్చినా.. ఎప్పుడూ నా కళ్లవెంట నీళ్లు రాలేదు. నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నా.. దాదాపు ఆరేడేళ్ల నుంచి ట్రై చేస్తున్నా.. ఇలాంటి పాత్ర కోసం. ఈ విషయం పూరీ జగన్నాథ్ అన్నయ్యకి బాగా తెలుసు. నేను మదర్ క్యారెక్టర్ కోసం వాడితో ఎంతో గొడవపడేదాన్ని. అలాగే సుకుమార్ గారితో కూడా గొడవ పడితే.. ఆయన కుమారి 21F సినిమాలో మదర్ క్యారెక్టర్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్ బాగా పండింది.. మంచి పేరు తెచ్చుకున్నా.. కానీ ఎందుకో దర్శకులు ఎవరూ నాకు మళ్లీ మదర్ క్యారెక్టర్ ఇవ్వలేదు. నా మనసులో ఉన్న కోరిక ఏంటి అంటే.. నేను శ్రీలక్ష్మిలా అవ్వాలని అనుకున్నా.. అయ్యాను కూడా.. బ్రహ్మానందం-శ్రీలక్ష్మీ.. బ్రహ్మానందం-కోవె సరళ.. బ్రహ్మానందం-హేమ అంతే. బ్రహ్మానందం-హేమల తరువాత ఎవరూ ఎక్స్ వై జెడ్ రాలేదు.. రారు కూడా. నాతోనే అది అయిపోయింది. అంత గొప్ప కాంబినేషన్ చేశా నేను. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను సాధించాను అనే గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని. నాకు నంది అవార్డ్ కూడా నా యాక్టింగ్ చూసి ఇచ్చారనే గర్వంలో ఫీలింగ్‌లో ఉండేదాన్ని. కానీ ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమాలో నేను పోషించిన అమ్మ పాత్ర.. నాకు పెద్ద సత్కారం. ఈ సినిమా సక్సెస్ మీట్‌కి వస్తానని అనుకోలేదు.. సినిమాకి వెళ్తాం మేడమ్ అని డైరెక్టర్ చెప్తే వచ్చానంతే.. కానీ నాకు ఇక్కడ లభించిన సత్కారం చూస్తే కళ్లవెంట ఆనందభాష్పాలు వస్తున్నాయి. నా లైఫ్‌లో ఫస్ట్ టైం ఆనందభాష్పాలు రావడం. నాకు ఇంతగొప్ప క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్‌కి ప్రత్యేక ధన్యవాదాలు.. ఈ పాత్రతో జనాల్ని ఏడిపించడమే కాకుండా.. నన్ను కూడా ఏడిపించేశారు. అలాగే ఈ సినిమా హీరో ప్రదీప్‌ని నేను తమ్ముడూ.. తమ్ముడూ అంటుంటాను. ఎక్కడ కలిసినా.. గోల గోలగా ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ సినిమా విషయంలో తనుకూడా చాలా ఫేవర్ చేశాడు. హేమను తల్లిగా అంటే జనాలు నవ్వుతారేమో కామెడీ అయిపోతుందేమో అని అభ్యంతరం చెప్పకుండా అందరూ సపోర్ట్ చేశారు. ఈ సినిమా టెక్నికల్ టీం కూడా నాకు బాగా సపోర్ట్ చేసినందుకే.. నేను ఇంత బాగా యాక్ట్ చేశానని అర్థమైంది. మీడియా వాళ్లు హేమక్కని తోపుని చేశారు.. హేమక్కని రెబల్ చేశారు.. హేమక్కని పులిని చేశారు.. ఈరోజు హేమమ్మ అని మీరే ఎంకరేజ్ చేయాలి.. మీరే నన్ను ప్రమోట్ చేయాలి’ అంటూ స్టేజ్‌పై భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది నటి హేమ.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ow58Lx

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz