Sunday, 31 January 2021

Khiladi: క్రాకింగ్ హిట్ తర్వాత మరో మాస్ జాతరకు ముహూర్తం ఫిక్స్.. 'ఖిలాడీ'గా రవితేజ రెడీ

ఈ మధ్య వరుస పరాజయాలతో సతమతమవుతున్న మాస్ మహారాజ్ ఇటీవలే 'క్రాక్' సినిమాతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కారు. కొత్త ఏడాది ఆరంభంలోనే సంక్రాంతి బరిలో దిగి క్రాకింగ్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం అదే జోష్‌లో తన లేటెస్ట్ మూవీ ''లో నటిస్తున్నారు. గత కొన్ని రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రానికి రమేశ్‌ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్, రవితేజ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాను మే 28వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ కొత్త పోస్టర్ విడుదల చేసి రవితేజ అభిమానుల్లో జోష్ నింపారు చిత్ర నిర్మాత సత్యనారాయణ కోనేరు. రాక్‌స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ కీలకపాత్రలో నటిస్తుండటం విశేషం. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై మాస్ మహారాజా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన అప్‌డేట్స్ చూస్తుంటే.. క్రాకింగ్ హిట్ తర్వాత ఈ వేసవిలో 'ఖిలాడీ' రూపంలో మరో మాస్ జాతర ఖాయమే అని తెలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2YrOemG

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....