Friday 29 January 2021

సమ్మర్ త్వరగా వస్తే ఎంత బాగుంటుందో..! ఆతృతగా ఉందంటున్న నిహారిక.. అసలు కారణమిదే

మెగా డాటర్ సమ్మర్ కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇది మేం చెప్పడం కాదండోయ్.. స్వయంగా ఆమెనే ట్వీట్ చేసింది. మరి సమ్మర్‌లో ఏంటి ప్రత్యేకం..? నిహారిక ఆతృత దేనికి? ఇదేగా మీ సందేహం. ఇక అక్కడికే వచ్చేద్దాం.. నిహారిక పెదనాన్న (డాడీ) హీరోగా రాబోతున్న ప్రతిష్టాత్మక సినిమా 'ఆచార్య' మే నెల 13వ తేదీన విడుదల కానున్నట్లు అఫీషియల్ ప్రకటన రావడంతో నిహారిక చూపు వేసవిపై పడింది. ఇటీవలే జొన్నలగడ్డ వెంకట చైతన్యను పెళ్లాడి ఓ ఇంటిదైన నిహారిక.. పెళ్లికి ముందు లాగే తన సోషల్ మీడియా హంగామాను కంటిన్యూ చేస్తోంది. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ ఫొటోస్, వెకేషన్ ట్రిప్స్ డీటెయిల్స్ లాంటి వివరాలు షేర్ చేస్తూనే రెగ్యులర్ అప్‌డేట్స్ కూడా మన ముందుకు తెస్తోంది. ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' టీజర్ చూసి ''అద్భుతం'' అని కామెంట్ చేసిన ఆమె.. సినిమా కోసం సమ్మర్ వరకూ ఆగాలా? ఈ సమ్మర్ త్వరగా వస్తే ఎంత బాగుంటుందో.. అని పేర్కొంది. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. మెగాస్టార్ 152వ సినిమాగా 'ఆచార్య' మన ముందుకు రాబోతోంది. సందేశాత్మక చిత్రాలను రూపొందించడంలో దిట్ట అని నిరూపించుకున్న కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. 'సిద్ధ' పాత్రలో రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ బాణీలు కడుతున్నారు. ఈ 'ఆచార్య'పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39vRbJ8

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz