Saturday, 30 January 2021

Mr Miss Movie: సక్సెస్ సంబరాల్లో ‘పెళ్లి చూపులు’ జ్ఞానేశ్వరి.. ప్రదీప్‌ సినిమాతో పోటీగా దిగి

జీ తెలుగులో ప్రసారమైన ‘పెళ్లి చూపులు’ షో యాంకర్ ప్రదీప్‌నే కాదు.. ఆ షోలో విజేతగా నిలిచిన జ్ఞానేశ్వరిని కూడా సెలబ్రిటీగా మార్చేసింది. పెళ్లి చూపులు షోలో విజేతగా నిలవడంతో.. ప్రదీప్‌కి నచ్చిన ఈ యువతిని పెళ్లాడబోతున్నాడనే వార్తలు వచ్చాయి. అయితే అది పెళ్లి చూపులు దగ్గరే ఆగిపోవడంతో ఇప్పటికీ వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త హాట్ టాపిక్ అవుతూనే ఉంది. ఆ విషయాన్ని పక్కనపెడితే.. వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా ఒకేసారి పరిచయం కావడమే కాదు.. వీళ్లి సినిమాలు కూడా ఒకే రోజు విడుదలయ్యాయి. యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమా నిన్న (జనవరి 29) విడుదల కాగా.. ఇదే రోజు హీరోయిన్‌గా నటించిన ‘మిస్టర్ & మిస్’ చిత్రం థియేటర్స్‌లో విడుదలైంది. అయితే ప్రదీప్ సినిమా భారీగా ఎక్కువ థియేటర్స్‌లో విడుదల కాగా.. జ్ఞానేశ్వరి తొలి చిత్రం మాత్రం చాలా తక్కువ థియేటర్స్‌లో విడుదలైంది. డేటింగ్, వీడియో చాటింగ్‌లతో పక్కదారి పడుతున్న యువతను మేలుకొలిపే కథనంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘మిస్టర్ అండ్ మిస్’ చిత్రాన్ని క్రౌడ్ ఫండెడ్ అశోక్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. జ్ఞానేశ్వరి కండ్రేగుల, శైలేష్ సన్ని జంటగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రం శుక్రవారం నాడు విడుదలై మంచి రెస్పాన్స్ రాబట్టడంతో సంబరాల్లో మునిగి తేలుతోంది చిత్ర యూనిట్. ఈ సందర్భంగా హీరోయిన్ జ్ఞానేశ్వరి మాట్లాడుతూ.. ‘మిస్టర్ అండ్ మిస్’ చాలా చిన్న సినిమా. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఈ సినిమాను రూపొంచింది ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాం. చాలా తక్కువ థియేటర్స్‌లో విడుదల చేసినప్పటికీ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ప్రీమియర్ షో రెస్పాన్స్ చూశాక మాకు సినిమాపై నమ్మకం ఏర్పడింది. ఈ సినిమా బిగ్ హిట్ కాబోతుందని. ఇక మార్నింగ్, మ్యాట్నీ, ఈవినింగ్ షోలు బాగా పికప్ అయ్యాయి. ఇక శని, ఆదివారాలు రావడంతో ఇంకా ఎక్కువ మంది ఆడియన్స్ వస్తారని ఆశిస్తున్నాం. నేను ఉదయం, మధ్యాహ్నం రెండు థియేటర్స్‌కి వెళ్లి చూసినప్పుడు యూత్ మాత్రమే వస్తారని ఎక్స్ పెక్ట్ చేశాను.. కానీ చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ కనిపించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఇష్టపడుతున్నారు. టీజర్, ట్రైలర్‌లు చూసి.. ఇది రొమాంటిక్, బోల్డ్ ఫిల్మ్ అని అనుకున్నారు చాలామంది. ఇలా అనుకోవడం వల్ల ఓన్లీ యంగ్ స్టార్ మాత్రమే వస్తారేమో అని అనుకున్నాం. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ వస్తున్నారు. సెకండాఫ్‌ని అన్ని వర్గాల వారు ఎంజాయ్ చేస్తున్నారు. నేను చేసిన సినిమా థియేటర్‌లో విడుదల కావడం.. ప్రేక్షకులతో కలసి చూడటం.. అది వాళ్లకు నచ్చడం గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. ఈ సినిమా సక్సెస్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను’ అంటూ మిస్టర్ అండ్ మిస్ సక్సెస్ సంబరాలను కేక్ కట్ చేసి.. బాణాసంచా కాల్చుతూ సెలబ్రేట్ చేసుకుంది హీరోయిన్ జ్ఞానేశ్వరి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pKj1ac

No comments:

Post a Comment

'Manoj Kumar Was Upset With Me'

'It is true Manoj Kumar was an excellent director with an unbeatable music sense.' from rediff Top Interviews https://ift.tt/ZNJps...