Friday, 29 January 2021

Live Telecast: లైవ్‌లో దెయ్యాన్ని చూపించాలనే వెరైటీ ఆలోచన.. పెళ్లయ్యాక కాజల్ డేరింగ్ స్టెప్

స్టార్ హీరోయిన్ ఇటీవలే తన ప్రియుడు గౌతమ్ కిచ్లూని పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేసి వచ్చిన ఈ అమ్మడు.. ప్రస్తుతం తాను కమిటైన సినిమాల షూటింగ్స్ పూర్తిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె తొలి వెబ్ సిరీస్ '' విడుదలకు సిద్ధమైంది. హారర్ నేపథ్యంలో ఓ డిఫరెంట్ కథతో రూపొందిన ఈ వెబ్ సిరీస్ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. కేవలం ఒక నిమిషం 19 సెకనుల నిడివితో కట్ చేయబడిన ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆసక్తికరంగా సాగిపోయింది. హారర్ సన్నివేశాలను చాలా డిఫరెంట్ వే లో షూట్ చేశారని తెలుస్తోంది. లైవ్‌లో దెయ్యాన్ని చూపించాలనే వెరైటీ ఆలోచన చేసి ఓ ఇంటికి వెళ్లిన కాజల్ బృందం ఎలాంటి అనుభవాలు ఎదుర్కొంది? నిజంగా వాళ్లకు దెయ్యం కనపడిందా? ఆ తర్వాత వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? అనే విషయాలను తెలియపర్చుతూ ట్రైలర్ విడుదల చేశారు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వెబ్ సీరీస్ థ్రిల్లింగ్ కథగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు క్లియర్‌గా అర్థమవుతోంది. ఈ మూవీలో టీవీ రిపోర్టర్‌గా కాజల్ కనిపించనుంది. టీఆర్పీ, సెన్సేషనలిజం కోసం దెయ్యాలను లైవ్‌లో కవర్ చేసి చూపిస్తామని కాజల్ చేసిన ప్రయత్నమే ఈ 'లైవ్ టెలికాస్ట్'. ఈ వెబ్ సిరీస్‌లో వైభవ్‌, ఆనంది కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 12వ తేదీన డిస్నీ హాట్‌స్టార్‌లో అన్ని భాషల్లో ఈ వెబ్ సిరీస్ విడుదల కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2MkX6Ih

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...