Saturday, 30 January 2021

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? కలెక్షన్ రిపోర్ట్.. తొలిరోజు యాంకర్ ప్రదీప్ హవా ఎలా ఉందంటే!!

బుల్లితెరపై తనదైన శైలి యాంకరింగ్ చేస్తూ సొంత అభిమానులను కూడగట్టుకున్న .. ? అంటూ వెండితెరపై హీరోగా ఆరంగేట్రం చేశాడు. ఈ సినిమాలో ప్రదీప్ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. నిన్న (శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమాకు ఆశించిన మేర స్పందన వచ్చిందని తాజాగా వచ్చిన కలెక్షన్ రిపోర్ట్ చూస్తుంటే అర్థమవుతోంది. మరోవైపు ప్రదీప్ నటనపై అన్ని వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుండటం ఈ మూవీకి ప్లస్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు కలెక్షన్ రిపోర్ట్ చూస్తే.. నైజాం- 64 లక్షలు సీడెడ్- 24 లక్షలు ఉత్తరాంధ్ర- 17 లక్షలు ఈస్ట్ గోదావరి- 14 లక్షలు వెస్ట్ గోదావరి- 12.5 లక్షలు కృష్ణా- 10 లక్షలు గుంటూరు- 19 లక్షలు నెల్లూరు- 8 లక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి టోటల్ కలెక్షన్స్ చూస్తే 2.73 కోట్ల గ్రాస్ వసూలు కాగా 1.69 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఇక కేరళ, ఇతర రాష్ట్రాలు కలిపి మరో 8 లక్షలు, ఓవర్‌సీస్‌లో 6 లక్షలు వసూలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా టోటల్‌గా చెప్పాలంటే 1.83 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదయ్యాయి. వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2.97 కోట్లు. ఏరియా వైజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూస్తే.. నైజాంలో 1.5 కోట్లు, సీడెడ్‌లో 55 లక్షలు, ఆంధ్రాలో 2.1 కోట్లు, మొత్తంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.8 కోట్ల టార్గెట్‌తో ఈ 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సో.. చూడాలి మరి మొదటి రోజు వచ్చిన రెస్పాన్స్ రానున్న రోజుల్లో ఎలా ఉంటుందనేది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3oyDmy7

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk