
స్టైలిష్ స్టార్ హీరోగా రూపొందుతున్న '' మూవీ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ ఇటీవలే కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 13వ తేదీన ఈ మూవీ రిలీజ్ కానుందని ప్రకటించారు. అయితే ఇక్కడే వచ్చి పడింది అసలు కన్ఫ్యూజన్. తాజాగా విడుదల చేసిన ఈ రిలీజ్ డేట్ పోస్టర్‌లో బన్నీ కాలుకు ఐదు వేళ్లే కనిపించడంతో జనాల్లో చర్చలు మొదలయ్యాయి. గతంలో అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్‌లో కూర్చుని ఉన్నట్లు ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయగా.. అందులో అల్లు అర్జున్ ఎడమకాలికి ఆరు వేళ్లు కనిపించాయి. కానీ లేటెస్ట్ పోస్టర్ నిశితంగా గమనిస్తే ఆ కాలుకి ఐదు వేళ్లే కనిపిస్తున్నాయి. దీంతో ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ బన్నీ ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నాడా? అని చర్చించుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే దీనిపై పెద్ద డిస్కషన్ మొదలైంది. చూడాలి మరి.. ఈ విషయంలో అసలు సీక్రెట్ ఏంటనేది సుకుమార్ చెబుతారా? లేక సస్పెన్సు లోనే ఉంచుతారా? అనేది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతోంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటిస్తుండగా.. ఆయన సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cE45XR
No comments:
Post a Comment