మై విలేజ్ షో టీమ్.. దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ఓ యూట్యూబ్ ఛానెల్ ఇది. మారుమూల గ్రామంలోని గల్లీలో ప్రారంభమైన వీరి ప్రయాణం సెలబ్రిటీల వరకూ వెళ్లింది. ఈ టీమ్ సభ్యుల్లో ముఖ్యంగా మాటతీరు తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. తెలంగాణ యాస, భాషకు ఉండే ఆదరణే వేరని తనదైన మాటలతో నిరూపించింది గంగవ్వ. కూలీ పనులు చేసుకుంటూ, కనీసం ఊరు దాటి బయటికి వెళ్లడం తెలియని ఆమె యూట్యూబ్‌తో ఓ స్టార్ అయిపోయింది. దీంతో బిగ్ బాస్ ఛాన్స్ రావడం, సినిమా ప్రమోషన్స్ కోసం గంగవ్వను ఎంటర్ చేయడం.. అబ్బో ఒక్కటేమిటి ఇలా ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే తాను హీరోగా చేసిన '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' సినిమా ప్రమోషన్స్ కోసం 'మై విలేజ్ షో' టీమ్‌తో ఓ వీడియో చేశారు. ఇందులో గంగవ్వతో ప్రదీప్ ముచ్చట్లు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటూ '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' సినిమాకు బెస్ట్ ప్రమోషన్ ఇస్తున్నాయి. అంతేకాదండోయ్.. ఈ వీడియో యూట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్‌లో టాప్‌లో ఉంది. ఈ నేపథ్యంలో మూవీ రిలీజ్ తర్వాత తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో , గంగవ్వపై యాంకర్ ప్రదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''మై విలేజ్ షో టీమ్ మొత్తం నన్ను ఆహ్వానించడంతో వాళ్ళ ఉరికి వెళ్లి గొర్రెల కాపరి వేషం కట్టాను. వాళ్ళు వాడే భాష, ఆ యాసలో ఉన్న కమ్మనితనం ఆస్వాదించాను. అవన్నీ నేర్చుకొని అలా మాట్లాడటానికి ప్రయత్నించాను. గంగవ్వ మంచి పెరుగన్నం పెట్టింది. అలా పొలం గట్లపై వాళ్లతో భోజనం చేయడం చాలా ఆనందంగా అనిపించింది. నా సినిమా ప్రమోషన్స్ కోసం వాళ్లు ఇచ్చిన సపోర్ట్‌కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నాను. గంగవ్వ కెమెరా ముందు చేసే యాక్టింగ్ చూసి నాకు ధైర్యం వచ్చింది. గంగవ్వ దగ్గరకు నేను వెళ్తున్నా అని చెప్పగానే అమ్మ చీర ఇచ్చి పంపించింది. ఆ రోజు షూట్ అయిపోయాక ఆమెకు ఆ చీరను గిఫ్ట్‌గా ఇచ్చాను. ఏంది.. బిడ్డా ఇవన్నీ ఎందుకు? అన్న గంగవ్వ.. లెదవ్వా నాతో పనిచేశావు కాబట్టి నా గుర్తుగా ఈ చీర ఇస్తున్నా అనగానే ఆనందంగా స్వీకరించింది'' అని ప్రదీప్ చెప్పుకొచ్చారు. ఇక '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' సినిమా విషయానికొస్తే.. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది. సుకుమార్ శిష్యుడైన మున్నా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రదీప్ సరసన అమృతా అయ్యర్ హీరోయిన్‌గా నటించింది. బెన్స్ సంగీతం అందించారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3j4V3nF
No comments:
Post a Comment