మాస్ మహారాజా హీరోగా, శృతిహాసన్ హీరోయిన్‌గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన మూవీ ‘క్రాక్’. బి.మధు నిర్మాత. భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. విడుదలైన తొలి వారంలోనే లాభాల బాట పట్టింది. తొలి రోజు ఆర్థిక సమస్యలతో రాత్రి వరకు షోలు పడకపోయినా ఆ ప్రభావం సినిమా కలెక్షన్లపై పడలేదు. మొత్తానికి రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా ‘క్రాక్’ నిలిచింది. ఇంత సూపర్ హిట్ అయిన ‘క్రాక్’ సినిమాను ఇంకా థియేటర్లలో చూడని వారికి శుభవార్త. ప్రముఖ అచ్చ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’లో ‘క్రాక్’ మూవీ అందుబాటులోకి వస్తోంది. ఫిబ్రవరి 5 నుంచి ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ‘క్రాక్’ వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌కు డేట్ ఫిక్స్ చేస్తూ ‘ఆహా’ ట్వీట్ చేసింది. అంతేకాదు, కొత్త ట్రైలర్‌ను రేపు 11 గంటలకు విడుదల చేస్తోంది ‘ఆహా’. ‘క్రాక్’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ‘ఆహా’ సొంతం చేసుకున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ రైట్స్‌ను ‘ఆహా’ రూ.6.5 కోట్లకు సొంతం చేసుకున్నట్టు మొదట ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం రాగా.. ఇప్పుడు, రూ.8 కోట్లని అంటున్నారు. నిజానికి రిపబ్లిక్ డేకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ‘ఆహా’ ప్లాన్ చేసిందట. అయితే, డిస్ట్రిబ్యూటర్ల నుంచి నిర్మాత మధుపై ఒత్తిడి రావడం.. ఆయన అల్లు అరవింద్‌ను రిక్వెస్ట్ చేయడంతో ఫిబ్రవరి 5కు వాయిదా వేసుకున్నారని టాక్. ఏదేమైనా థియేటర్‌లో విడుదలైన 27 రోజుల్లోనే ‘క్రాక్’ ఓటీటీలో అందుబాటులోకి వచ్చేస్తుంది. ఇదిలా ఉంటే, ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చారు. ఆయన అందించిన పాటలు, నేపథ్య సంగీతానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే, సాయి మాధవ్ బుర్రా రాసిన డైలాగులకు థియేటర్లలో ప్రేక్షకులు ఈలలు వేశారు. గోపీచంద్ మలినేని టేకింగ్, పోలీస్ అధికారిగా రవితేజ నటన ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాయి. ఇప్పుడు వీటన్నింటినీ ప్రేక్షకులు ఇంట్లోనే మరో నాలుగు రోజుల్లో ఎంజాయ్ చేయొచ్చు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pBHpe7
No comments:
Post a Comment