
ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్‌మెంట్స్ యువ కథానాయకుడు హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం విదితమే. 'కృష్ణ అండ్ హిజ్ లీల' చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రతిభ గల యువకుడు విమల్ కృష్ణను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని నేడు అధికారికంగా ప్రారంభించారు. ఉదయం 9 గంటల 9 నిమిషాలకు సంస్థ కార్యాలయంలో పూజాకార్యక్రమాలు జరిగాయి. చిత్ర నాయకా, నాయికలు సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టిలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి హారిక అండ్ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత నిర్మాత ఎస్. రాధాకృష్ణ పెద్ద కుమార్తె హారిక క్లాప్ నివ్వగా, చిన్న కుమార్తె హాసిని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హారిక అండ్ హాసిని చిత్ర నిర్మాణ సంస్థ అధినేత నిర్మాత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) చిత్ర దర్శక,నిర్మాతలకు చిత్రం స్క్రిప్ట్‌ను అందచేశారు. పి.డి.వి.ప్రసాద్ సమర్పణలోనిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 4 నుంచి ప్రారంభం కానుంది. కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు దర్శకుడు విమల్ కృష్ణ తెలిపారు. చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే ప్రకటిస్తామని ఆయన అన్నారు. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, నర్రా శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2YtTdn5
No comments:
Post a Comment