భారీ సినిమాలు రూపొందిస్తూ తనదంటూ ప్రత్యేక శైలి అని నిరూపించుకున్న స్టార్ డైరెక్టర్ శంకర్ చిక్కుల్లో పడ్డారు. అది కూడా ఆయన రూపొందించిన సినిమా కారణంగా. అప్పట్లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచి రికార్డులు తిరగరాసిన 'రోబో' కథ తనదే అంటూ ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలతో డైరెక్టర్ శంకర్‌కు చెన్నై ఎగ్మోర్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. 2010 సంవత్సరంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా రోబో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు శంకర్. సైన్స్ ఫిక్షన్ మూవీగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దీంతో అన్ని సెంటర్లలో భారీ ఆదరణ చూరగొని సూపర్ డూపర్ హిట్ సినిమాగా నిలిచింది. అయితే ఆ 'రోబో' కథపై అరుల్ తమిళ్ నందన్ అనే రైటర్, డైరెక్టర్ శంకర్‌పై పలు ఆరోపణలు చేస్తూ కోర్టుకెక్కాడు. తాను రాసిన 'జిగుబా' అనే కథను కాపీ కొట్టి శంకర్ రోబో చిత్రాన్ని తెరకెక్కించాడని కేసు వేశాడు. అయితే ఈ కేసు విషయమై విచారణకు హాజరు కావాలంటూ కోర్టు అనేక పర్యాయాలు ఆదేశించినప్పటికీ శంకర్ నుంచి ఎలాంటి స్సందన రాలేదు. దీంతో తాజాగా శంకర్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేస్తూ కేసును ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది చెన్నై ఎగ్మోర్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ కోర్టు. 1996లో అరుర్ తమిళ్ నందన్ రాసిన 'జిగుబా' కథ ఓ తమిళ మ్యాగజైన్‌లో ప్రచురితమవడమే కాకుండా ఆ తర్వాత 2007లో ఈ కథను ఓ నవలగా ముద్రించారు. సో.. చూడాలి మరి 'రోబో'తో వచ్చిన చిక్కుల్లోంచి శంకర్ ఎలా బయటపడతారనేది!.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3apwQEE
No comments:
Post a Comment