Tuesday, 26 January 2021

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? ప్రీ రిలీజ్ బిజినెస్.. ప్రదీప్ మొదటి సినిమానే అయినా డిమాండ్ బాగానే ఉందే!

ఇన్నిరోజులు యాంకర్‌గా సత్తా చాటిన ప్రదీప్, ఇక ఇప్పుడు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ? అనే ఆసక్తికర టైటిల్‌తో వెండితెరపై అలరించబోతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌ శిష్యుడు మున్నా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని జనవరి 29వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు బయటకొచ్చాయి. బడ్జెట్ విషయంలో ఎక్కడా వెనకాడకుండా ఎస్వీ బాబు నిర్మించిన ఈ సినిమాలో ప్రదీప్ సరసన అమృతా అయ్యర్‌ హీరోయిన్‌గా నటించింది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా రాబోతున్న '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' సినిమా అప్‌డేట్స్, ట్రైలర్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావడంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ముఖ్యంగా 'నీలి నీలి ఆకాశం' సాంగ్ ఓ రేంజ్‌లో ట్రెండ్ కావడంతో ప్రతి ఒక్కరి దృష్టి ఈ మూవీపైనే పడింది. దీంతో ప్రదీప్ మొదటి సినిమానే అయినప్పటికీ.. డిమాండ్ పెరిగి చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగిందని లేటెస్ట్ రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది. నైజాంలో 1.5 కోట్లు, సీడెడ్‌లో 55 లక్షలు, ఆంధ్రాలో 2.1 కోట్లు, మొత్తంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని, అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 4.4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలిసింది. మొత్తంగా 4.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సో.. చూడాలి మరి ప్రదీప్ తొలి సినిమాతో ఎలాంటి వసూళ్లు రాబడతాడనేది!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2NwObnm

No comments:

Post a Comment

'Don't Find Anything Wrong With Nepotism'

'Why would a star's son not become an actor?' from rediff Top Interviews https://ift.tt/wsEaB64