Sunday, 24 January 2021

బంగారు బుల్లోడు తొలి రోజు ఎంత రాబట్టాడంటే.. రియల్లీ షాకింగ్ కలెక్షన్స్

టాలీవుడ్‌ మినిమమ్‌ గ్యారెంటీ హీరోగా పాపులారిటీ సంపాదించిన అల్లరి నరేష్ ఈ మధ్యకాలంలో సినిమాల ప్రవాహం కాస్త తగ్గించారు. జెట్ స్పీడుతో సినిమాలు చేసే ఆయన ప్రస్తుతం కథల ఎంపికపై దృష్టి పెట్టి డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ''. ఇలా నందమూరి బాలకృష్ణ ఓల్డ్ మూవీ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన అల్లరి నరేష్ సినిమా తొలిరోజు కలెక్షన్స్ చూసి షాక్ అవుతున్నారు జనం. కమర్షియల్ కామెడీ కథగా జనవరి 23వ తేదీన విడుదలైన 'బంగారు బుల్లోడు' మూవీపై ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపలేదని లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం అర్థమవుతోంది. ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్స్ అంతంత మాత్రం గానే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 450కి పైగా థియేటర్స్‌లో విడుదలైనప్పటికీ కలెక్షన్స్ పెద్దగా రాలేదు. సంక్రాంతి హాలిడేస్ కూడా ముగియడం ఈ కలెక్షన్స్‌పై కాస్త దెబ్బేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 'బంగారు బుల్లోడు' కేవలం 67 లక్షలు మాత్రమే రాబట్టాడు. అల్లరి నరేష్ ఫామ్ ప్రకారం చూస్తే మంచి ఓపెనింగ్స్ వచ్చినట్లే కానీ.. బిజినెస్ లెక్కలో చూసుకుంటే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ రావాల్సిందని విశ్లేషకులు అంటున్నారు. ఏరియాల వారి కలెక్షన్స్ రిపోర్ట్ చూస్తే.. నైజాం: 21L సీడెడ్: 13L ఉత్తరాంధ్ర: 11L ఈస్ట్ గోదావరి: 6.1L వెస్ట్ గోదావరి: 4.2L గుంటూరు: 4.6L కృష్ణా: 4L నెల్లూరు: 3.3L AP/TG టోటల్: 67 లక్షలు KA+ROI: 2 లక్షలు ఓవర్‌సీస్: 1 లక్ష WW Total: 70 లక్షలు, గ్రాస్ 1.15Cr 3.5 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగిన 'బంగారు బుల్లోడు' మొదటి రోజు మొత్తం మీద 70 లక్షల షేర్ రికవరీ చేశాడు. మొత్తం మీద మరో 2.8 కోట్ల రేంజ్ షేర్ సాధిస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. సో.. చూడాలి మరి రానున్న రోజుల్లో ఈ మూవీ లాభాల్లోకి వస్తోందా లేదా అనేది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3iEHWtn

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....