Sunday, 3 January 2021

స్నేహారెడ్డిని ఫస్ట్ టైం నైట్ పార్టీలో చూశా.. రాత్రి 2 గంటలవుతున్నా కూడా! అల్లు అర్జున్ ఓపెన్ కామెంట్స్

ప్రస్తుతం మీడియా పరిధి విస్తృతమై పెద్ద మొత్తంలో వెబ్‌సైట్స్ అందుబాటులోకి రావడంతో హీరోహీరోయిన్ల ప్రేమ ముచ్చట్లు, లవ్ మ్యారేజ్, సీక్రెట్ మ్యారేజ్ సంగతులన్నీ ఇట్టే తెలిసిపోతున్నాయి. ఇలానే ఈ మధ్యకాలంలో జరిగిన దగ్గుబాటి రానా, నితిన్, నిఖిల్, కాజల్ అగర్వాల్ ప్రేమ, పెళ్లి ముచ్చట్లు బాగా వైరల్ అయ్యాయి. వారి వారి మొదటి పరిచయం నుంచి పెళ్లి దాకా అన్ని విషయాలు ప్రేక్షకలోకానికి తెలిశాయి. కానీ గత పదేళ్ల క్రిందట వెబ్‌సైట్స్, యూట్యూబ్ లాంటి వాటి హవా ఇంతలా లేకపోవడంతో అల్లు అర్జున్- స్నేహా రెడ్డిల ప్రేమాయణం గురించి పెద్దగా ఎవ్వరికీ తెలియదు. ఈ క్రమంలో తాజాగా 'ఆహా' వేదికపై ఈ విషయాలను బయటపెట్టించారు . అదేనండీ.. సామ్ హోస్ట్ చేస్తున్న సామ్ జామ్ ప్రోగ్రాంలో స్నేహారెడ్డితో తొలిపరిచయం, ప్రేమ పెళ్లి సంగతులపై ప్రశ్నిస్తూ బన్నీ నోటి వెంటనే అన్నీ చెప్పించారు. ఈ క్రమంలో బన్నీ తన వ్యక్తిగత విషయాలు, కుటుంబ సంగతులు, చిన్ననాటి అల్లరి పనులు ఇలా అన్నింటిపై ఓపెన్ అయ్యారు. మీ భార్య అల్లు స్నేహారెడ్డిలో మీకు నచ్చింది ఏంటి? అని సమంత వేసిన ప్రశ్నపై అల్లు అర్జున్ ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. ఆమెలో ఉన్న డిగ్నిటీ తనకు బాగా నచ్చిందంటూ ఓ సందర్భాన్ని వివరించారు. తాను ఫస్ట్ టైం స్నేహను ఓ నైట్ క్లబ్ పార్టీలో చూశానని, అంత మందిలో కూడా ఆమె చాలా డిగ్నిటీగా కనిపించిందని అన్నారు. ఆ సందర్భంలో సమయం రాత్రి రెండు గంటలవుతున్నా కూడా చాలా పద్దతిగా కనిపించడం తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. అలాగే తన కొడుకు అయాన్ గురించి మాట్లాడుతూ.. అయాన్ అంటేనే ఇష్టమని, ఇంట్లో అయాన్‌తోనే ఎక్కువ సమయం గడుపుతుంటానని అన్నారు. కాకపోతే అయాన్‌కు కెమెరాలన్నా, ఫోటోలు తీయడమన్నా నచ్చదు కానీ అర్హ మాత్రం ఎప్పుడూ ముందుంటుంది కాబట్టి ఎక్కువ ఫోటోలు అర్హతోనే ఉంటాయని అన్నారు. బన్నీ చెప్పిన ఈ ఆసక్తికర సంగతులు, సమంత చిలిపి ప్రశ్నలతో లేటెస్ట్ సామ్ జామ్ ఎపిసోడ్ ఎంతో రసవత్తరంగా సాగింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pWbzc7

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....