Saturday, 10 October 2020

Extra Jabardasth: ఇదే మా మధ్య ఉన్న బంధం.. సుధీర్-రష్మి హార్ట్ టచ్చింగ్ మూమెంట్

ప్రతి మగాడి విజయం వెనుకాలా ఒక ఆడది ఉంటుందని అంటారు.. కానీ గత ఎనిమిదేళ్లుగా నా విజయం నా వెనుక కాదు.. నా పక్కనే ఉంది.. రష్మి రూపంలో అంటూ ఎమోషనల్‌గా మాట్లాడాడు సుధీర్. బుల్లితెరపై రష్మి-సుధీర్ జంటకు మంచి క్రేజ్ ఉంది. సుధీర్ అంటే రష్మి.. రష్మి అంటే సుధీర్ అనేంతగా వీరి మధ్య కెమెస్ట్రీ వర్కౌట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ ఇద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ బాగా పండటంతో ఆఫ స్క్రీన్‌లో కూడా ఏదో నడుస్తుందంటూ పుంకాను పుంకాలుగా రూమర్లు పుట్టుకొస్తుంటాయి. అయితే వీటిపై పలు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చిన సుధీర్-రష్మిలు జంట.. 300 ఎపిసోడ్ ప్రోమోలో మరోమారు తమ మధ్య ఉన్న రిలేషన్ గురించి ఓపెన్ అయ్యారు. ఎక్స్ ట్రా జబర్దస్త్ జడ్జీగా ఉన్న రోజా.. సుధీర్-రష్మిలు మధ్య ఉన్న రిలేషన్ గురించి స్టేజ్‌పైనే ప్రశ్నించారు. ‘మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను.. మీ ఇద్దరి ఫ్యాన్స్ మీ రిలేషన్ గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు.. అసలు రష్మి మీద నీ అభిప్రాయం ఏంటి? అని సుధీర్‌ని అడిగారు రోజా. దీంతో రష్మి గురించి చాలా ఎమోషనల్‌గా మాట్లాడాడు సుధీర్.. ‘ఆన్ స్క్రీన్‌లో నా స్కిట్‌లతో పాటు నాకు బాగా పేరు వచ్చిందంటే అది కేవలం రష్మి వల్లే.. సుధీర్ అంటే అందరూ గుర్తు పడతారు.. కానీ సుధీర్ రష్మి అంటే అందరూ గుర్తుపడతారు. ప్రతి మగాడి వెనుకు ఒక ఆడది ఉందని అంటారు.. కాని గత ఎనిమిదేళ్లుగా నా విజయం నా వెనక కాదు.. నా పక్కనే ఉంది.. రష్మి రూపంలో’ అంటూ ఎమోషనల్‌గా మాట్లాడాడు సుధీర్. ఇక ఈ ఎమోషనల్ సీన్‌కి రొమాంటిక్ టచ్ ఇస్తూ.. ఏమో ఏమో ఏమో చెప్పలేని మాయే ప్రేమో అనే సాంగ్‌కి అద్భుతంగా పెర్ఫామ్ చేసి మరోసారి రొమాన్స్ పిండేశారు రష్మి, సుధీర్‌ల జంట.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dqQUYF

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....