Thursday, 8 October 2020

Bomma Adhirindi: ఇది గాంధీ 2.0 యుగం.. చెంప మీద కొట్టినోడి మొహం పగలగొట్టడమే..! నాగబాబు నయా సెన్సేషన్

ఒక చెంప మీద దెబ్బ కొడితే రెండో చెంప చూపించమన్నాడు మహాత్మ గాంధీ. ఎక్కడా హింసకు తావివ్వకుండా అహింసా మార్గంలోనే వెళ్లాలని సూచించారు. అయితే ఇదంతా ఒకప్పటి సంగతి. ఈ మోడ్రన్ యుగంలో రాను రాను గాంధీ విధానాలు మంటగలిసి పోతున్నాయని స్పష్టంగా తెలుస్తోంది. నువ్వెంత అంటే నువ్వెంత అనే పరిస్థితులు నేటి సమాజంలో కనిపిస్తున్నాయని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇది యుగం అంటూ తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్న వారికి పరోక్షంగా ఓ వార్నింగ్ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశారు మెగా బ్రదర్ . Also Read: గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో నాగబాబుపై తెగ ట్రోలింగ్ నడుస్తోంది. బొమ్మ అదిరింది వివాదం కాస్త.. బాగా ముదిరిపోయి జగన్ ఫ్యాన్స్ వర్సెస్ నాగబాబు అన్నట్లుగా సీన్ మారింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని హేళన చేస్తూ బొమ్మ అదిరింది షోలో ఓ స్కిట్ చేయడం, దానిపై నాగబాబు పడి పడి నవ్వడం చూసి వైసీపీ వర్గాలు భగ్గుమన్నాయి. నాగబాబుపై వైసీపీ వర్గాలు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుండటంతో ఈ వివాదం జనాల్లో హాట్ ఇష్యూగా మారింది. ఈ నేపథ్యంలో అస్సలు వెనక్కి తగ్గేదే లేదన్నట్లుగా తనను ట్రోల్ చేస్తున్న వారిపై పరోక్షంగా కామెంట్స్ చేస్తూ ఫైర్ అవుతున్నారు నాగబాబు. Also Read: ఈ మేరకు ఇది గాంధీ యుగం కాదని, గాంధీ 2.0 యుగమని తెలుపుతూ సోషల్‌ మీడియాలో ఆయన ఓ పోస్ట్ పెట్టడం సంచలనంగా మారింది. ''ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడం పిరికివాడు లక్షణం, వాడు ఒక చెంప మీద కొడితే నువ్వు వాడి మొహం పగలగొట్టు'' అని పేర్కొంటూ తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టారు నాగబాబు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అయింది. దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. జగన్ అభిమానులు చిర్రెత్తిపోతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33MWRvP

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....